Viral: ఇదెక్కడి తింగరి యవ్వారం మావ.. ICUలో రోగికి భూతవైద్యం.. డాక్టర్లు కూడా

భూతవైద్యం ఆస్పత్రికి పాకింది. ఏకంగా ఐసీయూలోనే పూజల తంతు నడిచింది. డాక్టర్లు కూడా ఈ పూజలను చోద్యం చూసినట్లు చూశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: ఇదెక్కడి తింగరి యవ్వారం మావ.. ICUలో రోగికి భూతవైద్యం.. డాక్టర్లు కూడా
Exorcism In Hospital
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 03, 2022 | 2:44 PM

Trending: స్పేస్‌లో అద్భుతాలు చేస్తున్నాం. సైన్స్ పరంగా దూసుకుపోతున్నాం. మహమ్మారి కరోనా(Coronavirus)కు కూడా మందు కనిపెట్టాం. కానీ ఈ మూడనమ్మకాలను మాత్రం కొందరు మెదళ్లను నుంచి తొలగించలేకపోతున్నాం. ఇంకా భూతవైద్యాన్ని నమ్మేవారు మారుమూల పల్లెలతో పాటు సిటీలోనూ కొందరు ఉన్నారు. చదువుకున్న వాళ్లలోనూ ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి. అందుకు మదనపల్లి(Madanapalle)లో కుమార్తెలను చంపుకున్న తల్లీదండ్రుల పిచ్చితనమే ఉదాహారణ. తాజాగా ఝార్ఖండ్​(Jharkhand)లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఓ మహిళను పాము కాటేసింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో.. ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆమె చికిత్స పొందుతున్న గదికి భూతవైద్యుడిని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతున్న మహిళ కోలుకోవాలని అతడితో మాంత్రిక.. తాంత్రిక పూజలు చేయించారు.  అయితే ఆస్పత్రి వర్గాలు కూడా వారికి అడ్డు చెప్పకపోవడం గమనార్హం. 3 గంటల పాటు ఈ భూతవైద్యం కొనసాగింది. బాధితురాలి వీపుపై పళ్లెం పెట్టి.. ఏవో పూజలు చేశాడు ఆ మాంత్రికుడు. ఆమె బాడీ నుంచి పాయిజన్ తీసినట్లు కాసేపు కలరింగ్ ఇచ్చాడు. ఈ తంతును ఆస్పత్రి స్టాఫ్ తో పాటు కొందరు డాక్టర్లు సైతం తిలకించారు.  బాధితురాలు  ఆంబువా ఏరియాకు చెందిన శక్తి నాయక్​ భార్య 25 ఏళ్ల అర్చనా దేవిగా తెలుస్తోంది. గుమ్లా సదర్ ఆస్పత్రిలో ఈ భూతవైద్యం జరిగింది. గతంలో అక్కడ ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి…