Viral Video: రక్షా బంధన్‌కు బంగారు కానుక.. కస్టమర్ల కోసం స్వీ్ట్ షాప్ ఓనర్ వినూత్న ప్రయత్నం..
పాలు, నెయ్యి, పిండి, చక్కెర, డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేసే రాజస్తానీ సంప్రదాయ స్వీట్. 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడిన ఈ స్వీట్ ను ఆగ్రాలోని షా
సోదర సోదరీమణుల బంధానికీ ప్రతీక రాఖీ పౌర్ణిమ. అక్కాతమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్ల మధ్య బంధాన్ని జరుపుకునే పండగ. తమ సోదరులు దీర్ఘాయుష్షుతో ఉండాలని సోదరి రాఖీ కడితే.. ఆమెకు జీవితాంతం ఎలాంటి కష్టం రాకుండా తోడుగా కాపాడతానని వాగ్దానం చేస్తారు సోదరులు. కల్మషం ఎరుగని సోదరీ సోదరుల ప్రేమకు ప్రతిరూపమే రాఖీ. ఈ ఏడాది ఆగస్ట్ 12న జరుపుకోనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ స్వీట్ షాపు యజమాని సోదరీమణులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కస్టమర్లను ఆకర్షించడానికి సరికొత్త ఆలోచన తీసుకుచ్చాయి. ఆగ్రాలోని ఒక దుకాణం గోల్డెన్ ఘేవార్ పేరుతో స్వీట్ రెడీ చేశారు.
పాలు, నెయ్యి, పిండి, చక్కెర, డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేసే రాజస్తానీ సంప్రదాయ స్వీట్. 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడిన ఈ స్వీట్ ను ఆగ్రాలోని షా మార్కెట్ సమీపంలో బ్రజ్ రసయాన్ మిత్తన్ భండార్ తయారు చేశారు. ఇక ఈ గోల్డెన్ స్వీట్ కోనుగోలు చేసేందుకు షాపుకు జనం పోటెత్తారు. ఇప్పటివరకు దాదాపు 12 కిలోల గోల్డెన్ ఘెవర్ అమ్మడైంది. 24 క్యారెట్ల బంగారంతో పైభాగంలో ఉన్నందున గోల్డెన్ ఘేవర్ ధర కిలోకు రూ. 25,000. బ్రజ్ రసయాన్ స్వీట్స్ భండార్ యజమాని తుషార్ గుప్తా ప్రకారం, గోల్డెన్ ఘెవర్‌లో పిస్తా, బాదం, వేరుశెనగ, వాల్‌నట్‌లతో పాటు అనేక డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉన్నాయి. పైన ఐస్ క్రీం-ఫ్లేవర్ ఉన్న మలై పొర కూడా ఉంది.
ట్వీట్..
#WATCH उत्तर प्रदेश: रक्षा बंधन को लेकर आगरा में खास तौर पर ‘गोल्डन घेवर’ बनाए जा रहे हैं। गोल्डन घेवर की कीमत 25,000 रुपए प्रति किलो है। इस घेवर की खासियत ये है कि इसके ऊपर 24 कैरेट के सोने की परत लगाई गई है। pic.twitter.com/cn1AQOyq8X
— ANI_HindiNews (@AHindinews) August 2, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.