AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా..! ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో విషయాలు..

ఈ ఇళ్లు భూకంపాలను సైతం తట్టుకొని నిలబడతాయట. ఈ గ్రామంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆయుర్వేద మూలికలు ఎన్నో లభిస్తాయట.

Viral : భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా..! ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో విషయాలు..
Viral 1
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2022 | 7:31 AM

Share

ప్రపంచంలో మనకు తెలియని అనేక విషయాలు.. రహస్యాలు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో అంతుచిక్కని రహస్యాలు.. ప్రదేశాలు.. కోటలు ఉన్నాయి. దేశంలో అనేక రహస్యాలతో కూడిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే, మనం దేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. అయితే, భారతదేశంలోని చివరి గ్రామం ఏదో, అది ఎక్కడుందో తెలుసా..భారతదేశంలోని చివరి గ్రామం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉంది. దాని పేరు ‘మనా’. ఈ గ్రామాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు.

బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవడానికి ఎప్పుడు వెళ్లినా ఆ గ్రామానికి వెళ్లొచ్చు. ఎందుకంటే.. బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆ గ్రామం ఉంటుంది. దీనినే భారతదేశంలోని చివరి గ్రామం అని పిలుస్తారు. ఈ గ్రామంతో మహాభారతానికి కూడా సంబంధం ఉందని చెబుతారు పెద్దలు. ఈ గ్రామంలో దాదాపు 60 ఇళ్లు, 400 మంది జనాభా ఉంటారు. ఇక్కడ చాలా ఇళ్లు చెక్కతో చేసినవే. పైకప్పు రాతి పలకలతో ఉంటుంది.

ఇవి కూడా చదవండి
Viral

Viral

ఈ ఇళ్లు భూకంపాలను సైతం తట్టుకొని నిలబడతాయట. ఈ గ్రామంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆయుర్వేద మూలికలు ఎన్నో లభిస్తాయట. వీటన్నింటితో పాటు గణేష్ గుహ, వ్యాస గుహ కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలట. ఈ గుహలోనే మహాభారత రచన జరిగిందని చెబుతారు. మనా గ్రామం నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని హిందూ గ్రంధాల్లో తెలిపారు. పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు, ఇక్కడ ప్రవహించే సరస్వతి నది గుండా ఒక మార్గం కనుగొన్నారు. ఆ మార్గంలో అవాంతరాలు ఏర్పడటంతో భీముడు రెండు పెద్ద రాళ్లను తీసుకువచ్చి నదికి అడ్డంగా వేసి వంతెనను నిర్మించాడట. ఈ వంతెన ద్వారా వారు నది మీదుగా స్వర్గానికి వెళ్లారట. నేటికీ సరస్వతి నది ఆ ప్రదేశం గుండా ప్రవహిస్తూ అలకనందలో కలుస్తుంది. నేటికీ ఆ రాతి వంతెన నదిపై ఉంది. ఈ వంతెనను ‘భీంపుల్’ అని పిలుస్తారు.