అన్యోన్య దాంపత్యం..! మరణంలోనూ విడిపోని బంధం..

భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన బంధువులు, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషాద సంఘటన

అన్యోన్య దాంపత్యం..! మరణంలోనూ విడిపోని బంధం..
Untitled 1
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 03, 2022 | 2:23 PM

భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన బంధువులు, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషాద సంఘటన కాంచీపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉత్రమేరూర్ పక్కన ఉన్న మనాంపతి గ్రామానికి చెందిన 91 ఏళ్ల ఆరుముగం,అతని భార్య సులోచన ఇద్దరూ రిటైర్డ్ ఉపాధ్యాయులు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఆరుముగ, సులోచన కుమారులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వారి వృద్ధాప్యం కారణంగా ఆరుముగ శారీరక పరిస్థితి కొన్ని నెలలుగా క్షిణీంచింది. ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతున్నారు.

ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఇంట్లోనే మంచం పట్టడంతో సులోచన, కొడుకులు, కోడళ్లు, మనవలు దగ్గరుండి చూసుకుంటున్నారు. కానీ సులోచన మాత్రమే నేను నీకంటే ముందుగా భగవంతుడిని చేరుకోవాలని భర్తతో పదేపదే చెబుతూనే ఉంటుంది. ఇలా ఉండగానే, మంగళవారం ఉదయం సులోచన ఎప్పటిలాగే లేచి పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. ఇది చూసి షాక్ తిన్న కొడుకు, బంధువులు పరుగున వచ్చి ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. ఎంతసేపటికీ సులోచన స్పృహలోకి రాలేదు. అక్కడికక్కడే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్దారించారు.

అనంతరం బంధువులకు సమాచారం అందించారు. సులోచన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సులోచన ఉదయం 6 గంటలకు మృతి చెందినట్లు బంధువులు ఆమె భర్త ఆరుముగంతో చెప్పారు. ఆ సమాచారం విన్న ఆ వృద్ధుడు షాక్‌కు గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. దాంతో అందరూ మరింత ఉలిక్కిపడ్డారు. అలా కాసేపటికే అతడు కూడా ప్రాణాలు విడిచిపెట్టాడు.భార్య మరణాన్ని తట్టుకోలేక ఆరుముగ మృతి చెందిన ఘటన బంధువులు, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం ఆరుముగ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దంపతుల మృతదేహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మనాంపతి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి