Azadi Ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ముందు ఈ నియమాలు తప్పక గుర్తుంచుకోండి..
Azadi Ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకం భారతదేశానికి గుర్వకారణం. అందుకే ప్రతీ భారతీయుడు.. స్వాతంత్ర్య దినోత్సవం వేళ
Azadi Ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకం భారతదేశానికి గుర్వకారణం. అందుకే ప్రతీ భారతీయుడు.. స్వాతంత్ర్య దినోత్సవం వేళ జాతీయ జెండాను ఎంతో గర్వంగా ఎగురవేస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. భారత ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారీ ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే హర్ ఘర్ తిరంగ పేరుతో జాతి సమైక్యతను చాటి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రతీ పౌరుడు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సూచించింది. అయితే, దీనికి ముందుు త్రివర్ణ పతాకాన్ని అవమానించకుండా ఉండాలంటే దానికి సంబంధించిన అన్ని నియమ, నిబంధనలు, చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే.. చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఎందుకంటే.. జాతీయ జెండాకు సంబంధించి చట్టంలో ప్రత్యేకంగా నియమ, నిబంధనలు పేర్కొనడం జరిగింది. ఎవరైనా సరే ఆ నియమ, నిబంధనల ప్రకారమే జెండాను ఎగురవేయాల్సి ఉంటుంది. అయితే, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెంగా ఎగురవేయడానికి సంబంధించిన నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది ప్రభుత్వం. మరి ఆ మార్పులేంటి? ఉన్న నియమ, నిబంధనలేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
త్రివర్ణ పతాకం గురించి ఈ విషయాలను గుర్తుంచుకోండి..
త్రివర్ణ పతాకం జాతీయ గౌరవానికి చిహ్నం. జాతీయ చిహ్నాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక చట్టం ఉంది. ఈ చట్టంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారు జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుంది. వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు, వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు ఉన్నప్పుడు, త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతని కుడి వైపున ఉండాలి. అంతే కాకుండా త్రివర్ణ పతాకాన్ని ఎవరి వెనకాలా ఎగురవేయకూడదు.
ఇలా చేయకూడదు..
1. జెండాపై ఏదైనా రాయడం, సృష్టించడం, తొలగించడం చట్టవిరుద్ధం.
2. త్రివర్ణ పతాకాన్ని వాహనం వెనుక, విమానంలో లేదా ఓడలో పెట్టకూడదు.
3. త్రివర్ణ పతాకాన్ని ఏ వస్తువులు లేదా భవనాలను కవర్ చేయడానికి ఉపయోగించరాదు.
4. ఎట్టి పరిస్థితుల్లోనూ త్రివర్ణ పతాకం నేలను తాకకూడదు.
5. త్రివర్ణ పతాకాన్ని ఏ విధమైన యూనిఫాం లేదా అలంకరణ కోసం ఉపయోగించరాదు.
6. జాతీయ జెండా కంటే మరే ఇతర జెండా హైట్‌లో ఉంచకూడదు.
త్రివర్ణ పతాక నియమాలు..
1. ఇంతకు ముందు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు. అయితే, ఇప్పుడు దానిని 24 గంటలూ ఎగురవేయవచ్చు.
2. ఇంతకుముందు మెషీన్‌తో తయారు చేసిన, పాలిస్టర్ జెండాలను ఉపయోగించడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీతో తయారు చేసిన ఏ జెండానైనా ఎగురవేయవచ్చు.
3. 2002 సంవత్సరానికి ముందు, సాధారణ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయాలి. కానీ 2002 సంవత్సరంలో, భారతీయ జెండా కోడ్‌లో మార్పులు చేశారు. దీని ప్రకారం పౌరులు ఏ రోజునైనా జెండాను ఎగురవేయవచ్చు.
4. జెండా సైజ్ 2:3 నిష్పత్తిలో ఉండాలి. దీంతో పాటు జెండాను సక్రమంగా ఎగురవేయాలి. రివర్స్‌గా ఎగురవేయడం వంటివి చేయకూడదు.
5. జాతీయ జెండా ఎప్పుడూ నీటిలో ముంచవద్దు.
6. జెండా చిరిగినా లేదా మురికిగా మారినట్లయితే.. దానికి చట్ట ప్రకారం డిస్పోజ్ చేయాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..