Viral Video: మరణించిన జాతీయ పక్షి.. మృతదేహంపై కప్పిన జాతీయ జెండా.. భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు..
జాతీయ పక్షిని పూడ్చిపెట్టే ముందు నివాళులర్పించిన ఘటనలు గతంలోనూ జరిగాయి. అయితే త్రివర్ణ పతాకాన్ని నెమలి మృత దేహంపై కప్పడం ఎప్పుడు, ఎక్కడా జరగలేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Viral Video: నెమలి మన జాతీయ పక్షి అన్న సంగతి తెలిసిందే. అందంగా ఉండే ఈ పక్షి పురి విప్పి నాట్యం చేస్తే అందరూ ఆసక్తిగా చూస్తారు. సోషల్ మీడియాలో నెమలికి సంబంధించిన అనేక అందమైన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నెమలి మృతి చెందింది. దీంతో అంత్యక్రియలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ఘటనపై రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఘజియాబాద్‌లో నెమలి మరణించింది. భారత జాతీయ పక్షి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ముందుగా నెమలి మృతదేహానికి జాతీయ జెండాతో కప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో సౌరభ్ త్రివేది ట్విట్టర్ లో షేర్ చేశారు. కౌశాంబి మెట్రో స్టేషన్‌లో నెమలి చనిపోయి కనిపించింది.
వైరల్ వీడియో
Ghaziabad Police wrapped the dead bird (Peacock) in tricolour before burying it. The bird was found dead at Kaushambi metro station. Experts say it is a violation of flag code of India. pic.twitter.com/Nbj8ImsgBn
— Saurabh Trivedi (@saurabh3vedi) August 2, 2022
మనం తరుచుగా సైనికులు, పోలీసు కుక్కల మరణాన్ని చూస్తున్నాం.. వారిని అంతిమయాత్రను గౌరవంగా నిర్వహిస్తారు. అయితే వారి భౌతిక కాయాన్ని భారత జాతీయ జెండాతో కప్పడం చూడలేదు.. ఇక జాతీయ పక్షిని పూడ్చిపెట్టే ముందు నివాళులర్పించిన ఘటనలు గతంలోనూ జరిగాయి. అయితే త్రివర్ణ పతాకాన్ని నెమలి మృత దేహంపై కప్పడం ఎప్పుడు, ఎక్కడా జరగలేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘన?
అందమైన పక్షికి జాతీయ లేదా రాష్ట్ర అంత్యక్రియలు జరుగుతాయా? దేశ రక్షణ చేస్తూ.. మరణించిన జవాన్లకు ఘన నివాళి అర్పించడం సర్వసాధారణం. అయితే జాతీయ పక్షి లేదా జంతువు మరణిస్తే ఖననం చేయడానికి కొన్ని నియాలున్నాయి.
జాతీయ జంతువు ఖనన నియమాలు ఏమిటంటే.. చనిపోయిన నెమలిని చెక్క మంచంపై, అటవీ శాఖ అధికారుల సమక్షంలో దహనం చేస్తారు. దహన సంస్కార ప్రక్రియకు ముందు, పంచనామా నివేదికతో పాటు తప్పనిసరిగా పోస్ట్‌మార్టం నిర్వహించాలి.
ఘజియాబాద్‌లోని సెమీ డెవలప్‌డ్ టౌన్‌షిప్ వేవ్ సిటీలో ఏప్రిల్ 2018లో.. పాంటీ చద్దాలో దాదాపు 12 నెమళ్లు చనిపోయాయి. నీటి కోసం వెదుకుతూ ఉద్యోగ కుంజ్ ప్రాంతంలోకి చేరుకున్న నెమళ్ళు.. E-16 ప్లాట్‌లో ఉన్న ఫ్యాక్టరీనుంచి విడుదలైన విషపూరితమైన నీటిని సేవించి మరణించాయని పలు నివేదికలు పేర్కొన్నాయి.
2018లో మరో కేసులో.. ఢిల్లీ పోలీసులు మరణించిన నెమలిని చెక్క పెట్టెలో పాతిపెట్టే ముందు త్రివర్ణ పతాకంతో చుట్టారు. పోలీసులు నెమలిని హైకోర్టు వెలుపల జరిగిన రోడ్డు లో రక్షించారు. పక్షి గాయాలతో మరణించింది. భారతదేశ జాతీయ పక్షి కనుక పోలీసులు “ప్రోటోకాల్”ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..