Success Story: ఆర్మీ మహిళా లెఫ్టినెంట్ గా ఎంపికైన వంశిక పాండే.. మా రాష్ట్రం గౌరవాన్ని పెంచిందంటున్న సీఎం..

ఛత్తీస్‌గఢ్‌కు తొలి మహిళా లెఫ్టినెంట్‌గా గుర్తింపు పొందిన వంశిక పాండే స్వగ్రామానికి చేరుకోగానే ఆమెను అభినందించేందుకు జనం క్యూ కట్టారు. తన విజయం వెనుక తన తండ్రి వంశీక్ అజయ్ పాండే, తల్లి సరళా పాండేతో పాటు.. సోదరి మాన్సీ పాండే పూర్తి మద్దతు ఇచ్చారని వంశిక పేర్కొంది. 

Success Story: ఆర్మీ మహిళా లెఫ్టినెంట్ గా ఎంపికైన వంశిక పాండే.. మా రాష్ట్రం గౌరవాన్ని పెంచిందంటున్న సీఎం..
Success Story Of Vanshika P
Follow us

|

Updated on: Aug 02, 2022 | 6:37 PM

Success Story: దేశంలో మారుతున్న కాలంలో విద్య, ఉద్యోగం, ఉపాధి ఇలా అన్ని రకాల మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో స్త్రీలు.  పురుషులతో సమానంగా నడుస్తున్నారు. ఈ రోజు నేటి యువతకు స్ఫూర్తినిచ్చే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వంశిక పాండే గురించి తెలుసుకుందాం. వంశికను చూసి ఛత్తీస్‌గఢ్ మొత్తం గర్విస్తోంది. భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా  చేరిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మొదటి మహిళ వంశిక. రాష్ట్ర సీఎం భూపేష్ బఘెల్ వంశిక విజయానికి గ్రీటింగ్స్ చెప్పారు. లెఫ్టినెంట్‌గా చేరుకున్న వంశిక ప్రయాణం గురించి ఈరోజు తెలుసుకుందాం..

వంశిక పాండే ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ నివాసి. చిన్నప్పటి నుండి ప్రతిభావంతులైన విద్యార్థిని. వంశిక 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు రాజ్‌నంద్‌గావ్‌లోని బాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది.  అనంతరం యుగంతర్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యనభ్యసించింది. ఇంజినీరింగ్‌ చదువుల కోసం జబల్‌పూర్‌లోని జ్ఞాన్‌ గంగా ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరింది.

ఇంజనీరింగ్ సమయంలో సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్న వంశిక వంశిక మొదటి నుంచి చదువులో బాగా రాణించింది. భోపాల్‌లోని రాజీవ్ గాంధీ ఇండస్ట్రియల్ యూనివర్శిటీ మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత అయింది. మెకానికల్ ఇంజినీరింగ్‌లో వంశిక దేశంలోనే థర్డ్ ప్లేస్ లో పాస్ అయింది. తాను జబల్‌పూర్‌లో ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్మీ శిక్షణ ఇస్తుందని.. తాను అక్కడ చదువుతున్న సమయంలో  కొంతమంది అధికారులతో మాట్లాదినట్లు వంశిక చెప్పింది. అప్పుడు తాను ఎలాగైనా సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఎంపిక:  ఎస్‌ఎస్‌బీ పరీక్షలో ఎంపికైన తర్వాత శిక్షణ కోసం వంశిక చెన్నై వెళ్ళింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో సీనియర్ ఆర్మీ అధికారుల సమక్షంలో వంశిక ఉత్తీర్ణత అయింది. సైన్యంలో 11 నెలల అత్యున్నత శిక్షణ తీసుకుంది. ఇప్పుడు లెఫ్టినెంట్ హోదాను అందుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు తొలి మహిళా లెఫ్టినెంట్‌గా గుర్తింపు పొందిన వంశిక పాండే స్వగ్రామానికి చేరుకోగానే ఆమెను అభినందించేందుకు జనం క్యూ కట్టారు. తన విజయం వెనుక తన తండ్రి వంశీక్ అజయ్ పాండే, తల్లి సరళా పాండేతో పాటు.. సోదరి మాన్సీ పాండే పూర్తి మద్దతు ఇచ్చారని వంశిక పేర్కొంది.

గ్రీటింగ్స్ చెప్పిన ముఖ్యమంత్రి: భారత సైన్యంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తొలి మహిళా లెఫ్టినెంట్‌గా ఎంపికైన వంశిక పాండేకి ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ గ్రీటింగ్స్ తెలిపారు. మహిళా- శిశు అభివృద్ధి శాఖ మంత్రి అనిలా భెండియా కూడా వంశిక పాండేను అభినందించారు. వంశికకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. తన తల్లిదండ్రులతో పాటు యావత్ రాష్ట్ర గౌరవాన్ని వంశిక పెంచిందని అన్నారు. వంశిక విజయం రాష్ట్రంలోని లక్షలాది మంది బాలికలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వంశిక పాండే ను జూలై 30న చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో లెఫ్టినెంట్ హోదాతో సత్కరించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..