AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: కోడి గుడ్డు పెంకులతో కాల్షియం, పౌడర్ తయారీ.. ఏడాదికి లక్షలు ఆర్జిస్తున్న అక్కడి మహిళలు..

సర్వసాధారణంగా కోడి గుడ్డుని(Egg shells) ఉపయోగించిన అనంతరం.. దాని గుల్లను బయటపడేస్తారు. కొంచెం అవగాహన ఉన్నవారు మాత్రం.. ఆ కోడి గుడ్డు పొట్టునిమొక్కలకు ఎరువుగా వేస్తారు. అయితే ఛత్తీస్ గడ్ లోని మహిళలు మరికొంచెం ముందుకు వెళ్లి.. వెరైటీగా ఆలోచించారు. ఇప్పుడు ఈ కోడి గుడ్డు పొట్టుతో వ్యాపారం చేస్తున్నారు.

Inspiring Story: కోడి గుడ్డు పెంకులతో కాల్షియం, పౌడర్ తయారీ.. ఏడాదికి లక్షలు ఆర్జిస్తున్న అక్కడి మహిళలు..
Eggshell Business In Chhatt
Surya Kala
|

Updated on: Jun 26, 2022 | 4:36 PM

Share

Inspiring Story: ప్రకృతిలోని ప్రతి వస్తువు, జీవి తిరిగి మళ్ళీ ఏదొక రూపంలో మనిషికి ఉపయోగపడుతుంది. తమ తెలివి తేటలకు కృషి పట్టుదలను జత చేసి..స్వయం ఉపాధితో తమకంటూ ఉపాధిని కల్పించుకుంటూ.. పదిమందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తులు అనేకమంది ఉన్నారు. తాజాగా మనం ఎందుకూ పనికి రాదని తీసి పడేసే కోడి గుడ్డు.. పొట్టుతో లక్షలు ఆర్జిస్తున్నారు. అవును సర్వసాధారణంగా కోడి గుడ్డుని(Egg shells) ఉపయోగించిన అనంతరం.. దాని గుల్లను బయటపడేస్తారు. కొంచెం అవగాహన ఉన్నవారు మాత్రం.. ఆ కోడి గుడ్డు పొట్టునిమొక్కలకు ఎరువుగా వేస్తారు. అయితే ఛత్తీస్ గడ్ లోని మహిళలు మరికొంచెం ముందుకు వెళ్లి.. వెరైటీగా ఆలోచించారు. ఇప్పుడు ఈ కోడి గుడ్డు పొట్టుతో వ్యాపారం చేస్తున్నారు. కోడి గుడ్డు పొట్టుతో వ్యాపారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కోడి గుడ్డు గుల్లని ఎవరూ ఉపకరమైన వస్తువు అని అనుకోలేదు. అయితే.. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలోని మహిళలు..  అంబికా మునిసిపల్ కార్పొరేషన్ సహాయంతో..  ఈ గుడ్ల పెంకులను  ద్వారా ఆదాయం పొందుతున్నారు. దీనికి ఒక  ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. ఆ మార్గంలో సాధికారతను కూడా పొందారు.

సెర్బుజా జిల్లా కలెక్టర్ రీతూ సేన్ జిల్లాలోని మహిళా సాధికారత అవసరాన్ని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సహాయంతో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు.  క్యాంటీన్ మేనేజ్మెంట్, పార్కింగ్, అటెండన్స్ , నగరంలో చెత్త మేనేజ్మెంట్ వివిధ కారిక్రమాలతో మహిళలకు పని చూపించేవారు. ఈ నేపథ్యంలో మరొక అడుగు ముందుకేసి..   కొత్తగా మునిసిపల్ కార్పొరేషన్ కొత్తగా ఒక కారిక్రమానికి శ్రీకారం చుట్టింది. గుడ్డు పెంకుల నుండి కాల్షియం పౌడర్ , ఎరువులు తయారు చేసే విధంగా మహిళలను ప్రోత్సహించింది.

ఇవి కూడా చదవండి

 క్యాల్షియం పౌడర్

ఈ మేరకు మహిళలకు కోడి గుడ్డు పెంకుల నిర్వహణపై పర్యావరణవేత్త సి శ్రీనివాసన్ తో శిక్షణ ఇప్పించారు. . క్యాల్షియం పౌడర్ మరియు ఎరువులను తయారు చేసే విధంగా మహిళలకు తర్ఫీదు ఇచ్చారు. ముందుగా గుడ్డు పెంకులను నీటితో కడిగి, ఎండలో ఎండబెడతారు. అనంతరం ఆ గుడ్డు పెంకులను మెత్తగా దంచుతారు. అనంతరం ఆ పొడిని జల్లెడ పట్టి  ఫిల్టర్ చేస్తారు. ఈ గుడ్డు పెంకు ఒక కిలోగ్రాము పొడిని ఒక క్వింటాల్ కోళ్ల దాణాకు కలుపుతారు. ఇది విత్తనాలలో కాల్షియంను తిరిగి నింపుతుంది. తద్వారా కోళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఇదే విషయంపై ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ సెంటర్ మేనేజర్ డాక్టర్ సికె మిశ్రా  స్పందిస్తూ.. “సర్గుజా కలెక్టర్ మార్గదర్శకత్వంలో, రాష్ట్రంలో మొదటిసారిగా, గుడ్డు పెంకు పొడి ఉత్పత్తిని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. పశుసంవర్థక శాఖ కూడా వారికి పూర్తి సాయం చేస్తోంది. దీంతో కోడి గుడ్డు పెంకులు చెత్తలోకి వ్యర్ధాలుగా వెళ్లకుండారీసైక్లింగ్ అవుతుంది. ఓ వైపు మహిళలకు ఆదాయాన్ని ఇస్తుంది. మరోవైపు కోళ్లకు ఆరోగ్యాన్ని ఇస్తుందని.. చెప్పారు. అంతే కాకుండా కోడిగుడ్డు పెంకులను పూలు, ఇతర పంటలకు ఎరువుగా కూడా వినియోగిస్తున్నారు.

పండ్ల , కూరగాయల తొక్కలు, విత్తనాలు మొదలైన ఇతర రకాల తడి వ్యర్థాలతో పోలిస్తే గుడ్డు పెంకులు కంపోస్ట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కనుక గుడ్డు పెంకుల నుండి వ్యాపించే మురికిని అరికట్టడానికి మహిళా స్వయం సహాయక బృందం గుడ్డు పెంకుల నుండి ప్రత్యేకంగా ఎరువులు తయారు చేస్తుంది.

కోడి గుడ్డు పౌడర్, కోడి గుడ్డు ఎరువులు రెండూ కిలో రూ.200 నుంచి రూ.600 వరకు పలుకుతున్నాయి. ఇక్కడ మహిళ గ్రూపులు నెలకు 50 నుండి 60 కిలోల కోడి గుడ్డు పౌడర్ ని తయారు చేస్తున్నారు.  దీంతో నెలకు రూ. 12000 నుండి రూ. 36000 వరకు ఆదాయం లభిస్తోంది. అసలు దేనికి పనికి రాని ఈ కోడి గుడ్డు పొట్టుతో ఇక్కడ మహిళలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..