Birds of Poison: అందమైన ఈ పక్షి శరీరం అంతా విషం.. కనిపిస్తే వీటిని చంపేస్తున్న మనుషులు.. ఎక్కడంటే..

అత్యంత ప్రమాదకరమైన పక్షి.. మనిషి ప్రాణాలను తీసేటంత విషం ఈ పక్షి ఈకలో ఉంది. విషపూరితమైన పక్షులలో ఇది మాత్రమే ఒకటి. దీని ఈకలు విజ్ఞాన శాస్త్రానికి తెలిసినంత వరకూ అత్యంత శక్తివంతమైన విషపదార్ధాలలో నిండి ఉంది.

Birds of Poison: అందమైన ఈ పక్షి శరీరం అంతా విషం.. కనిపిస్తే వీటిని చంపేస్తున్న మనుషులు.. ఎక్కడంటే..
Birds Of Poison Hooded Pito
Surya Kala

|

Jun 26, 2022 | 6:42 PM

Birds of Poison: భూమి మీద మనిషితో పాటు అనేక రకాల జంతువులు, పక్షులు, మొక్కలు జీవిస్తున్నాయి. వీటిల్లో కొన్ని సాధువి. వీటి వలన మనిషికి ఏ విధమైన హాని జరగదు. మరొకొన్ని కౄర జంతువులు, ఇంకొన్ని విషపూరితమైన జంతువులు. అయితే మొక్కల్లో కూడా మనిషికి హాని చేసే విషపూరితమైన మొక్కలు ఉన్నాయి.. కానీ ఇప్పటి వరకూ పక్షుల్లో కూడా విషపూరితమైన పక్షి ఉందని.. ఈ పక్షిని తాకితే మరణిస్తాడని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అవును పాములు, తేళ్లు, జెర్రెలతో పాటు.. కొన్ని రకాల మొక్కలు విషయం కలిగి ఉంటాయి. ఇవి కుడితే.. విషం మనిషి శరీరంలోకి వెళ్లి.. ప్రాణాపాయం కలుగజేస్తాయి.. అయితే ఓ పక్షి మనిషి ప్రాణాన్ని హరించే విషం కలిగి ఉంది.

ఆఫ్రికాలోని పవునా న్యూ గినియా అనే దేశంలో ఈ విషపూరితమైన పక్షి ఉంది. దీనిని హూడెడ్ పితహూయ్ అని అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పక్షి.. మనిషి ప్రాణాలను తీసేటంత విషం ఈ పక్షి ఈకలో ఉంది. విషపూరితమైన పక్షులలో ఇది మాత్రమే ఒకటి. దీని ఈకలు విజ్ఞాన శాస్త్రానికి తెలిసినంత వరకూ అత్యంత శక్తివంతమైన విషపదార్ధాలలో నిండి ఉంది.

1989లో కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన జాక్ డంబాచెర్ పక్షుల పరిశోధ నిమిత్తం పవునా న్యూ గినియాకు వెళ్లారు. అక్కడ పక్షుల కోసం చెట్ల మధ్య  సున్నితమైన వలలను బిగించాడు. ఒక రోజు వలలో చిక్కుకున్న అంకెల పక్షులను చూశాడు. వాటిల్లో ఒకటి హూడెడ్ పితహూయ్. ఈ పక్షి బలమైన ముక్కు, ముదురు ఎరుపు రంగు కళ్ళు, చిన్న నలుపు , నారింజ రంగు రెక్కలు కలిగి ఎంతో అందంగా కనిపించాయి. జాక్ తన వలల నుండి హూడెడ్ పితహూయ్ ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న సంయమలో అతని చేతులకు పక్షి కాలి గోర్లు గీసుకున్నాయి. దీంతో అతను చెప్పలేని బాధను భరించాడు. నొప్పిని తగ్గించుకోవడానికి అతను తన వేళ్లను నోటిలో పెట్టాడు.. వెంటనే అతని నాలుక  జలదరింపజేసి మండింది. దీంతో జాక్ ఈ విచిత్రమైన ప్రభావం గురించి ఏదైనా తెలుసా అని స్థానికులను అడిగాడు. అప్పుడు వారు హూడెడ్ పితహూయ్ గురించి.. అది విషం కలిగి పక్షి అని..  తినడం మంచిది కాదని చెప్పారు.

వెంటనే జాక్ తదుపరి పరీక్షల కోసం పక్షి ఈకలను USకి పంపించాడు.  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని రసాయన శాస్త్రవేత్త జాన్ డాలీకి వాటిని చూపించాడు. అప్పుడు ఆ పరీక్షల్లో ఈ పక్షిలో మనిషి ప్రాణాలు తీసేంత అత్యంత ప్రమాదకకరమైన హోమోబాట్రో ఖాటోక్సిన్ అనే విషయం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ పక్షి కనిపిస్తే చాలు స్థానికులు కాల్చి చంపేస్తున్నారు. చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ పక్షి విషంతో నిండి ఉంటుంది. ఈ విషయం తెలియని.. వారు ముద్దుగా ఉందని.. పక్షిని చేరదీసి ముద్దు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అప్పటినుంచి ఈ పక్షి కనిపిస్తే చాలు ఆఫ్రికా ప్రజలు భయపడిపోతున్నారు. అది కనిపిస్తే చాలా చంపేస్తున్నారు. వేటగాళ్లు సైతం ఈ పక్షి ఉన్న ప్రాంతాలకు వెళ్లడం లేదు.. హూడెడ్ పితహూయ్ చూస్తేనే భయపడిపోతున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి విషపూరిమైన పక్షి

1800ల ప్రారంభంలో బంగారు కరోలినా చిలుకలు అత్యంత విషపూరితమైనవి గా ఉండేవి.. కానీ కాలక్రమంలో అంతమయ్యాయి. ఇప్పుడు ఈ పక్షులను కనిపిస్తే చంపేస్తుండడంతో ఇవి కూడా అంతమైపోతాయేమో అంటూ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిహ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu