Viral Video: తన ఇంటిలో రష్యన్ క్షిపణి.. పక్కన మామూలుగా షేవ్ చేసుకుంటున్న ఉక్రెయిన్ వ్యక్తి.. వీడియో వైరల్

ఆ వీడియోలో ఉక్రేనియన్ వ్యక్తి తన వంటగది సీలింగ్‌ నుంచి రాకెట్ తన ఇంటికి ప్రవేశించిన రంధ్రం చూపించాడు. అతను చాలా క్యాజువల్‌గా సింక్ దగ్గర షేవింగ్ చేస్తూ కనిపించాడు

Viral Video: తన ఇంటిలో రష్యన్ క్షిపణి..  పక్కన మామూలుగా షేవ్ చేసుకుంటున్న ఉక్రెయిన్ వ్యక్తి.. వీడియో వైరల్
Ukrainian Man Shaving Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2022 | 5:53 PM

Viral Video: రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం (Russia Ukraine War) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావం ఆ రెండు దేశాలప్రజలపైనే కాదు.. ప్రపంచ దేశాల ప్రజల జీవనంపై కూడా పడిందని చెప్పవచ్చు. ఈ యుద్ధం.. ఉక్రేనియన్ల జీవితాన్ని ఒక పీడకలగా మార్చింది. ఇప్పటికే ఈ యుద్ధంలో అనేక మంది మరణించారు. మిలియన్ల కొద్ది ఉక్రెయిన్ దేశం విడిచి పెట్టి వెళ్లిపోయారు. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన అనేక వీడియోలు తూర్పు ఐరోపా దేశం నుండి ప్రతిరోజూ వెలువడుతూనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు చిల్లింగ్ గా ఉంటూ.. అక్కడ ప్రజల జీవన విధానంపై ఏ విధంగా యుద్ధం ప్రభావం చూపిస్తోందో చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి తన వంటగదిలో రష్యా రాకెట్ తన పక్కనే కూర్చొని క్యాజువల్‌గా షేవింగ్ చేసుకుంటున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఉక్రేనియన్ వ్యక్తి తన ఇంటిలో  రష్యన్ రాకెట్ పైభాగంలో పడి ఉంది. అయినప్పటికీ అతను అద్దం ముందు షేవింగ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఆ వీడియోలో ఉక్రేనియన్ వ్యక్తి తన వంటగది సీలింగ్‌ నుంచి రాకెట్ తన ఇంటికి ప్రవేశించిన రంధ్రం చూపించాడు. అతను చాలా క్యాజువల్‌గా సింక్ దగ్గర షేవింగ్ చేస్తూ కనిపించాడు. అతని కంటే పెద్ద రాకెట్‌ ముక్క అతని కుడివైపు సీలింగ్‌కి వేలాడుతూ కనిపించింది. అయితే నెటిజన్లు అతని ఇంటిలో క్షిపణి శకలం చూసి.. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటున్న అతని ప్రశాంతమైన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయారు.

ఒక వినియోగదారు “నా గదిలో సాలీడు ఉంటే, నేను లోపలికి వెళ్లను.” “ఈ వ్యక్తి తన గడ్డాన్ని రాకెట్‌తో షేవ్ చేస్తున్నాడని కామెంట్ చేశారు. అది “ఒక ముక్క? అది మొత్తం రాకెట్ కాదా? “అంటూ ప్రశ్నించాడు. అయితే, కొంతమంది నిపుణులు అది ర్యాకెట్ లో పేలిపోయే భాగం కాదని అన్నారు. అయినప్పటికీ “క్షిపణి” పక్కన చాలా సాధారణంగా షేవింగ్ చేసుకుంటున్న వ్యక్తిని చూసి చాలా మంది ఆందోళన చెందారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..