foot bridge collapse: వంతెనపై నడుస్తుండగా కుప్పకూలిన ఫుట్ బ్రిడ్జి.. షాకింగ్ వీడియో..
అందమైన నగరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలాంటి ప్రాంతంలో ప్రజలకు మరింత ఆనందాన్ని చేకూర్చేలా ఓ వాగుపైన అధికారులు ఫుట్ బ్రిడ్జిని నిర్మించారు. ఫుట్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు.
అందమైన నగరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలాంటి ప్రాంతంలో ప్రజలకు మరింత ఆనందాన్ని చేకూర్చేలా ఓ వాగుపైన అధికారులు ఫుట్ బ్రిడ్జిని నిర్మించారు. ఫుట్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫుట్ బ్రిడ్జిపై అందరూ నడుస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నగర మండలి సభ్యులతో సహా స్థానిక అధికారులు బండరాళ్లపై వాగులో పడిపోయారు. ఈ షాకింగ్ ఘటన మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రారంభోత్సవ వేడుకలోనే ఫుట్‌బ్రిడ్జ్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దానిపై అమర్చిన చెక్కలతోపాటు నడుస్తున్న వారు చెల్లాచెదురుగా కిందపడిపోయారు. ఈ సంఘటనపై మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ మాట్లాడుతూ ప్రారంభ సమయంలో.. తనతో పాటు వచ్చిన కొంతమంది వంతెనపై దూకుతున్నారని.. అందుకే అది ఒక్కసారిగా కూలినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

