Driving License: వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్ ఇలా వాడితే.. రూ. 5 వేల జరిమానా..

నిర్ణీత కాల వ్యవధి కోసం RTO డ్రైవింగ్ లైసెన్స్‌ని జారీ చేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత ఉపయోగంలో ఉండదు. రెన్యూవల్ చేయకుండా వాడితే భారీగా ఫైన్ పడుతుంది.

Driving License: వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్ ఇలా వాడితే.. రూ. 5 వేల జరిమానా..
Driving License
Follow us
Venkata Chari

|

Updated on: Aug 02, 2022 | 9:32 PM

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం అంటే చలాన్‌‌తో చెలగాటం ఆడినట్లే అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటేనే సరిపోదు.. దానిపై కాస్త శ్రద్ధ కూడా చూపాల్సి ఉంటుంది. లేదంటే భారీగా ఫైన్ పడే ఛాన్స్ ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఐదు వేల రూపాయల చలాన్ పడుతుంది. వాస్తవానికి RTO నిర్దిష్ట చెల్లుబాటు కోసం డ్రైవింగ్ లైసెన్స్‌ని జారీ చేస్తుంది. ఈ గడువు ముగిసినప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ ఇకపై చెల్లుబాటు కాదు. అలాంటప్పుడు ప్రజలు తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పునరుద్ధరించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసేలోపే రెన్యువల్ చేసుకోవాలి..

భారతదేశంలో ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేస్తుంది. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ 20 సంవత్సరాలు లేదా దరఖాస్తుదారుకి 50 సంవత్సరాల వయస్సు వరకు, ఏది ముందుగా ఉంటే అది చెల్లుబాటు అవుతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసేలోపు మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. మీరు సంబంధిత RTO లేదా ఆన్‌లైన్‌లో కూడా డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ని ఎలా రెన్యూవల్ చేసుకోవాలి..

రవాణా మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్‌ను ఓపెన్ చేసి, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ లేదా లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ పేరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అనేక సౌకర్యాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు ముగియబోతున్నట్లయితే, మీరు ఈ పోర్టల్ నుంచి దాన్ని పునరుద్ధరించవచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ని పునరుద్ధరించడానికి ఈ దశలను అనుసరించాల్సి ఉంటుంది.

  1. రవాణా సేవల పోర్టల్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  2. ఆన్‌లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి.
  3. ఇక్కడ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలను ఎంచుకోండి.
  4. దీని తర్వాత డ్రాప్ డౌన్ జాబితా నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  5. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ఆఫ్షన్ ఎంచుకుని క్లిక్ చేయండి.
  6. ఇక్కడ మీరు మీ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
  7. తదుపరి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించి, ఫీజు చెల్లించండి.
  8. మీ రసీదు స్లిప్‌ను మీ దగ్గర ఉంచుకోండి.

డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే ఫైన్..

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి మీరు RTOకి కూడా వెళ్లవచ్చు. ఇక్కడ ఫారం-9 నింపి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, మెడికల్ ఫిట్‌నెస్ కోసం ఫారం-1Aపై రిజిస్టర్డ్ డాక్టర్ సంతకం చేయాల్సి ఉంటుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినట్లయితే, RTO ఆలస్యంగా రెన్యువల్ చేసినందుకు జరిమానా కూడా విధిస్తుంది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే