Viral News: విడాకుల పార్టీని ఘనంగా జరుపుకున్న మహిళ.. పార్టీలో పరిచయమైన వెయిటర్ తో ప్రేమ పెళ్లి..
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న గాబ్రియెల్లా లాండోల్ఫీ అనే మహిళ తన భర్త నుండి విడాకులు తీసుకుంది. అనంతరం గాబ్రియెల్లా లాండోల్ఫీ గొప్ప పార్టీ చేసుకుంది. అయితే ఇక్కడే ఉంది టిస్ట్.. తాను ఇచ్చిన విడాకుల పార్టీలోనే మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ కథ సినిమాలా అనిపించినా ఇది పూర్తిగా నిజం.
Viral News: పెళ్లంటే నూరేళ్ళ పంట. వివాహంతో ఇద్దరు ఒక్కటిగా మారి… దాంపత్య జీవితంలో ఎదురైనా కష్టాలను ఇష్టంగా మార్చుకుని.. ఒకరికోసం ఒకరు అడ్జెస్ట్ అయి..జీవితాంతం తోడునీడగా జీవిస్తారు. అందూకనే వివాహాన్ని పవిత్రబంధంగా భావిస్తారు. కానీ కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా నేటి జంటల్లో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఏడేడు జన్మలు ఎందుకు.. కనీసం ఒక్క జన్మలోనే కలిసి ఉండలేకపోతున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి గురించి పక్కన పెడితే.. తాము ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా విడిపోతున్నారు. ప్రేమించుకునే ముందు ఉన్న బంధం, అనుబంధం పెళ్లి తర్వాత కనిపించడంలేదు. వివాహానికి ముందు.. ప్రేమ జంటలు ఎంతో సంతోషంగా నవ్వుతూ, తుళ్ళుతూ.. జోక్స్ చేసుకుంటూ జీవిస్తారు. కానీ వివాహం తర్వాత ఈ సంబంధంలో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకుంటూ చివరకు గొడవపడి.. విడిపోయేవరకూ వెళ్తున్నారు. ఇది ప్రేమ వివాహ కథే అయినా.. దాదాపు ఇదే విధంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో కూడా జరుగుతున్నాయి. అటువంటి విడాకుల కథ ఈ రోజుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. విడాకులకు సంబంధించిన విచిత్రమైన కథనాన్ని మీరు వినలేదు లేదా చూడలేదు.
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న గాబ్రియెల్లా లాండోల్ఫీ అనే మహిళ తన భర్త నుండి విడాకులు తీసుకుంది. అనంతరం గాబ్రియెల్లా లాండోల్ఫీ గొప్ప పార్టీ చేసుకుంది. అయితే ఇక్కడే ఉంది టిస్ట్.. తాను ఇచ్చిన విడాకుల పార్టీలోనే మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ కథ సినిమాలా అనిపించినా ఇది పూర్తిగా నిజం.
టాప్ లెస్ వెయిటర్ మిర్రర్ నివేదిక ప్రకారం.. గాబ్రియెల్లా తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత .. డైవర్స్ తీసుకున్న సంతోషన్ని అందరితోనూ పంచుకోవాలని కోరుకుంది. అందుకనే విడాకుల వేడుకను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో పార్టీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి కొంతమంది టాప్‌లెస్ మెయిల్ వెయిటర్‌లు వచ్చారు. పార్టీ ఘనంగా జరిగింది. మర్నాడు గాబ్రియెల్లాకు జాన్ అనే వెయిటర్ మెసేజ్ చేశాడు. అలా మొదలైన వీరిద్దరి పరిచయంతో తరచుగా కలవడం వరకూ వెళ్ళింది. ఒకరికొకరు నచ్చడంతో.. డేటింగ్ మొదలు పెట్టారు
ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు అయ్యారు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత, జాన్ మెల్బోర్న్‌లోని రియాల్టో టవర్‌లో గాబ్రియెల్లాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఈ జంట ఒక చిన్నారికి తల్లిదండ్రులు. మొదటి సారి గర్భస్రావం జరిగింది. అయితే మళ్ళీ డిసెంబర్ 2020 లో గాబ్రియెల్లా మళ్ళీ గర్భం దాల్చింది. జూలై 2021లో ఎమర్జెన్సీ సి-సెక్షన్ చేసి.. ఐదు వారాల ముందుగానే బేబీ మాటియోకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ దంపతులు తమ చిన్నారితో సంతోషంగా జీవిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..