Viral Video: ఈ చింపాంజీ స్టైలే వేరబ్బా.. ముద్దులు, హగ్గులతో మహిళకు సర్‌ప్రైజ్.. నెట్టింట వైరల్ వీడియో..

Chimpanzee Viral Video: జీన్స్ ధరించిన చింపాంజీ ఓ మహిళతో చాలా ఫన్నీగా ప్రవర్తించింది. గట్టిగా కౌగిలించుకుకోవడంతోపాటు ఒకటే ముద్దుల వర్షం కురిపించి, వెరైటీగా నవ్వుతూ సందడి చేసింది.

Viral Video: ఈ చింపాంజీ స్టైలే వేరబ్బా.. ముద్దులు, హగ్గులతో మహిళకు సర్‌ప్రైజ్.. నెట్టింట వైరల్ వీడియో..
Chimpanzee Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 03, 2022 | 1:18 PM

Chimpanzee Viral Video: ఓ చింపాంజీ జీన్స్‌ ధరించి ఓ మహిళను ముద్దాడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. చింపాంజీలు కేవలం మనోహరమైనవి మరియు వినోదభరితమైనవి మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ఇలా ప్రేమగా మనుషులతో కలిసి సందడి చేస్తుంటాయి. మనుషుల మాదిరిగానే భావోద్వేగాలను పంచుకుంటున్న వీడియోలు నెట్టింట్లో ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి వీడియోనే నెటిజన్లను తెగ నవ్విస్తోంది. చింపాంజీ ఆ మహిళలతో కలిసి చేసిన సందడి చూస్తే, మీరు కచ్చితంగా నవ్వుకుంటారు.

సౌమియా చంద్రశేఖరన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో సఫారీ వరల్డ్‌ను సందర్శించి చింపాంజీతో ఫోటోషూట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 20కి పైగా కామెంట్‌లతో 5.3 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌, 255,288 లైక్‌లతో ఈ వీడియో నెట్టింట్లో తన మార్క్‌ని చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో, సౌమియా స్వింగ్‌‌తోపాటు జీన్స్ ధరించి ఉన్న చింపాంజీని చూడొచ్చు. ఫొటో షూట్‌లో భాగంగా చింపాంజీ ఈమెతో కలిసి ఎన్నో ఫోజులు ఇచ్చింది. ముద్దులు పెడుతూ, భుజాలపైకి ఎక్కుతూ, షెక్ హ్యాండ్ ఇస్తూ ఇలా తెగ సందడి చేసింది. ఆ తర్వాత వెరైటీగా స్మైల్ ఇస్తూ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లను తెగ నచ్చేసింది. ఈమేరకు కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆ చింపాంజీకి నువ్ తెగ నచ్చేశావ్ అంటూ కొందరు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

సఫారీ వరల్డ్‌కు చెందిన ఏజెంట్ పర్యవేక్షణలో ఈ వీడియో చిత్రీకరించారు. వారు చెప్పినట్లే చింపాంజీ కూడా పర్యాటకులతో ఫోజులు ఇస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఆమె బేబీ ఏనుగులతో కూడా ఫొటో షూట్ చేసింది. ఈ వీడియోను కూడా నెట్టింట్లో పంచుకుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీక్షించే వీడియోల జాబితాలో జంతువులవే ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వీడియోలు మానసిక స్థితిని పెంచడమే కాకుండా, ఒత్తిడిని అధిగమించడంలో కూడా సహాయపడతాయి.