Viral Video: డీజే డ్యాన్స్‌లో అమ్మాయిల కొట్లాట.. జుట్లు పట్టుకుని మరీ.. కారణమేంటో తెలుసా?

Girls Fight Video: అంతవరకు డీజే పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ఇంతలో ఏమైందో కానీ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని మరీ పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. నడిరోడ్డులా ఉన్నామన్న స్పృహలేకుండా విచక్షణా రహితంగా కొట్లాడుకున్నారు.

Viral Video: డీజే డ్యాన్స్‌లో అమ్మాయిల కొట్లాట.. జుట్లు పట్టుకుని మరీ.. కారణమేంటో తెలుసా?
Girls Fight
Follow us
Basha Shek

|

Updated on: Aug 04, 2022 | 9:00 AM

Girls Fight Video: అంతవరకు డీజే పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ఇంతలో ఏమైందో కానీ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని మరీ పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. నడిరోడ్డులా ఉన్నామన్న స్పృహలేకుండా విచక్షణా రహితంగా కొట్లాడుకున్నారు. ఈ రెండు గ్రూపులలోనూ అమ్మాయిలే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ గర్ల్స్‌ ఫైట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అమ్మాయిలు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం మనం చూడవచ్చు. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో డీజే సంగీతం కూడా వినిపిస్తుంటుంది. వీరి గొడవను చూసిన కొందరు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ వారి మాట వినలేదు. మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌ అంటూ గ్యాప్ ఇవ్వకుండా కొట్టుకున్నారు అమ్మాయిలు.

కాగా ఈ అమ్మాయిల గొడవకు కారణం మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. అయితే అక్కడ ఉన్న ఎవరో ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. @Chandan18029052 అనే యూజర్ ఈ వీడియోను నెట్టింట్లో షేర్‌ చేస్తూ ‘ డీజేలో డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు అమ్మాయిలు గొడవ పడ్డారు. జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు’ అని షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో గల బిష్రాంపూర్ ప్రాంతానికి చెందిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తూ రీషేర్‌లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..