Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్‌కు అదిరిపోయే ఆతిథ్యమిచ్చిన విండీస్‌ మాజీ కెప్టెన్‌.. థ్యాంక్స్‌ బ్రో అంటూ

India vs WestIndies: కరేబియన్‌ దీవులంటేనే సుందరమైన బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలకు నెలవు. అందుకే ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కడ వాలిపోతుంటారు చాలామంది. ఇదిలా ఉంటే ఇప్పుడు భారత క్రికెట్‌ జట్టు విండీస్‌ పర్యటనలో ఉంది.

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్‌కు అదిరిపోయే ఆతిథ్యమిచ్చిన విండీస్‌ మాజీ కెప్టెన్‌.. థ్యాంక్స్‌ బ్రో అంటూ
Hardik Pandya
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2022 | 1:51 PM

India vs WestIndies: కరేబియన్‌ దీవులంటేనే సుందరమైన బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలకు నెలవు. అందుకే ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కడ వాలిపోతుంటారు చాలామంది. ఇదిలా ఉంటే ఇప్పుడు భారత క్రికెట్‌ జట్టు విండీస్‌ పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. కాగా నాలుగో టీ20 కి నాలుగు రోజుల గ్యాప్‌ రావడంలో భారత క్రికెటర్లు కరేబియన్‌ దీవుల అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రముఖ బీచ్‌లు, వెకేషన్‌ స్పాట్‌లకు వెళుతున్నారు. ఇదిలా ఉంటే స్టార్‌ ఆల్‌రైండర్‌ హార్ధిక్‌ పాండ్యా (Hardik Pandya) మాత్రం తన ముంబై ఇండియన్స్‌ టీమ్‌ మేట్‌ , తనెంతో అభిమానించే విండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ (Kieron Pollard) ఇంటికి వెళ్లాడు. అతని కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపాడు.

కాగా విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. ఈక్రమంలోనే విండీస్‌ పర్యటనను ముగించుకునేముందు పొలార్డ్‌ ఇంటికెళ్లాడు హార్దిక్‌. వారి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘కింగ్‌ పోలార్డ్‌ ఆతిథ్యం స్వీకరించకుండా కరేబియన్‌ పర్యటన ముగియదు. పోలార్డ్‌ అంటే నాకు ఎంతో అభిమానం. అన్నతో సమానం. మాకు అదిరపోయే ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. ఈ ఫొటోల్లో పొలార్డ్‌ సతీమణి, వారి ముగ్గురు పిల్లలను మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా భారత్, విండీస్‌ జట్ల మధ్య రేపు నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..