AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: అపెండిక్స్‌ అడ్డుపడింది.. లాంగ్‌జంప్‌ కష్టమన్నారు.. సీన్‌ కట్‌ చేస్తే కాంస్యంతో హిస్టరీ క్రియేట్‌

Commonwealth Games 2022: గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల లాంగ్‌ జంప్‌ (Long Jump) ఫైనల్లో భారత్‌ అథ్లెట్‌ మురళీ శ్రీశంకర్‌ (Murali Sreeshankar) రజతం సాధించి సరికొత్త చరిత్రను లిఖించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో లాంగ్‌ జంప్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.

CWG 2022: అపెండిక్స్‌ అడ్డుపడింది.. లాంగ్‌జంప్‌ కష్టమన్నారు.. సీన్‌ కట్‌ చేస్తే కాంస్యంతో హిస్టరీ క్రియేట్‌
Murali Sreeshankar
Basha Shek
| Edited By: Team Veegam|

Updated on: Aug 05, 2022 | 12:34 PM

Share

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. టోర్నీ ప్రారంభంలో కామన్వెల్త్‌ ఆటగాళ్లు వరుస పతకాలు గెల్చుకుంటే ఇప్పుడు అథ్లెట్లు ఆ బాధ్యత తీసుకున్నారు. తమ తమ విభాగాల్లో సత్తా చాటుతూ అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. బుధవారం హై జంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సొంతం చేసుకుని ఆ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల లాంగ్‌ జంప్‌ (Long Jump) ఫైనల్లో భారత్‌ అథ్లెట్‌ మురళీ శ్రీశంకర్‌ (Murali Sreeshankar) రజతం సాధించి సరికొత్త చరిత్రను లిఖించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో లాంగ్‌ జంప్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.

ఆఖరి నిమిషంలో దూరమై..

గురువారం అర్ధరాత్రి జరిగిన లాంగ్‌జంప్‌ ఫైనల్లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్‌ రెండో స్థానంలో నిలిచాడు. తద్వారా భారత్‌ ఖాతాలో రజత పతకాన్ని చేర్చాడు. ఇదే ఈవెంట్‌లో బహమాస్‌కు చెందిన లకాన్‌ నైర్న్‌ కూడా 8.08 మీటర్లే దూకి బంగారు పతకం గెల్చుకున్నాడు. ఎందుకంటే లకాన్‌ రెండో ఉత్తమ ప్రదర్శన(7.98 మీటర్లు).. శ్రీశంకర్‌(7.84 మీటర్లు) కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్‌(8.05 మీటర్లు) దూకి కాంస్యం సొంతం చేసుకున్నాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్‌ 2018 కామన్‌వెల్త్‌ క్రీడలకు ఆఖరి నిమిషంలో దూరమయ్యాడు. అపెండిక్స్‌ సమస్యే ఇందుకు కారణం. గత కామన్‌వెల్త్‌కు దూరమైన మురళీ ఇకపై లాంగ్‌ జంప్‌ చేయకపోవచ్చు అని అంతా భావించారు. అయితే అతను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. అపెండిక్స్‌ ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆ తర్వాత కఠోర సాధన మొదలుపెట్టాడు. లాంగ్‌జంప్‌లో తనను తాను మెరుగు పరుచుకున్నాడు. ఆకష్టానికి తగిన ప్రతిఫలమే ఈ కామన్వెల్త్‌ మెడల్‌.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..