Telugu News Entertainment Tollywood Rashmika Mandanna celebrates Friendship Day in a special way by sharing throwback photos of her friends goes viral Telugu Cinema News
Viral Photo: బుంగమూతి పెట్టుకుని ఫొటోకు పోజులిస్తోన్న ఈ స్టార్ నటి ఎవరో గుర్తుపట్టారా?
Friendship Day 2022: స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ తమ స్నేహితులతో దిగిన త్రో బ్యాక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వారితో గడిపిన మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకున్నారు. పై ఫొటో కూడా అలాంటిదే.
Friendship Day 2022: స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ తమ స్నేహితులతో దిగిన త్రో బ్యాక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వారితో గడిపిన మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకున్నారు. పై ఫొటో కూడా అలాంటిదే. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఓ ముద్దుగుమ్మ ఫ్రెండ్‌షిప్ డేను పురస్కరించుకుని తన స్నేహితులతో కలిసి దిగిన పాత ఫొటోలన్నింటినీ షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా స్నేహితులతో కలిసి దిగిన ఓ మిర్రర్ సెల్ఫీ ఫొటోను పంచుకుంది. ఇందులో బుంగమూతి పెట్టుకుని మరీ ఫొటోకు పోజులిచ్చిందీ అందాలతార. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరి ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టేటస్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోన్న ఈ సొగసరి మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందాన. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అందులో తన ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోలన్నింటినీ షేర్ చేసుకుంది. ‘నేను సాధారణంగా ఫ్రెండ్‌షిప్ డే, హగ్ డే, చాక్లెట్ డే లేదా వాలెంటైన్స్ డేని సీరియస్‌గా తీసుకోను. అలాగే నా పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా మాట్లాడను. కానీ ఈ ఫొటోల్లో ఉన్న వారు (కొందరు మిస్ అయ్యారు) నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. నా జీవితంలో వారెంత ముఖ్యమో ఈ స్నేహితుల దినోత్సవానికి మించి మంచి రోజు లేదనుకుంటాను. వారు లేకుండా నేను లేను. ఎప్పటికీ వీరిని ప్రేమిస్తుంటాను. నా మనసులో వీరికి ఎప్పుడూ ప్రత్యేక స్థానముంటుంది. అందరికీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే ‘ అంటూ ఎమోషనలైంది రష్మిక. ఇందులో సినిమా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రౌడీబాయ్ విజయ్‌దేవరకొండ, ఛలో డైరెక్టర్ వెంకీ కుడుముల తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సీతారామం చిత్రంలో ఆఫ్రీన్ పాత్రలో అలరించిన రష్మిక చేతిలో పుష్ప2, వారసుడు సినిమాలు ఉన్నాయి. అలాగే హిందీలో మిషన్ మజ్ఞు, గుడ్‌బై, యానిమల్ సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతోంది.