AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapse Pannu: ‘నా సెక్స్‌ లైఫ్‌..’ అంటూ కరణ్‌ జోహార్‌పై షాకింగ్ కామెంట్స్‌ చేసిన తాప్సీ..

Taapse Pannu: బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కాఫీ విత్‌ కరణ్‌ (Koffee With Karan) ఛాట్‌షో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఛాట్‌షోకు హాజరైన ప్రముఖుల శృంగార జీవితంపై కరణ్‌ ఓపెన్‌గా ప్రశ్నలు అడుగుతుండడమే దీనికి కారణం..

Taapse Pannu: 'నా సెక్స్‌ లైఫ్‌..' అంటూ కరణ్‌ జోహార్‌పై షాకింగ్ కామెంట్స్‌ చేసిన తాప్సీ..
Taapse Pannu
Basha Shek
|

Updated on: Aug 08, 2022 | 1:02 PM

Share

Taapse Pannu: బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కాఫీ విత్‌ కరణ్‌ (Koffee With Karan) ఛాట్‌షో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఛాట్‌షోకు హాజరైన ప్రముఖుల శృంగార జీవితంపై కరణ్‌ ఓపెన్‌గా ప్రశ్నలు అడుగుతుండడమే దీనికి కారణం. ఇటీవల లైగర్‌ ప్రమోషన్లలో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండే (Ananya Panday).. లాల్‌ సింగ్ చద్దా ప్రమోషన్లలో ఆమిర్ ఖాన్‌ (Aamir Khan), కరీనా క‌పూర్ (Kareena Kapoor) వంటి సెలబ్రటీలు ఈ షోకు హాజరయ్యారు. శృంగారానికి సంబంధించి కరణ్‌ అడిగిన ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ కూడా ఇలాగే ఓపెన్‌ అయ్యారు. అయితే కొందరు ఈ టాక్‌షోపై విమర్శలు గుప్పిస్తున్నారు. పడకగది వ్యవహారాల గురించి ఇంత ఓపెన్‌గా డిస్కస్‌ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తాప్సీ కూడా ఈ లిస్టులో చేరింది. ఆమె హీరోయిన్‌గా న‌టించిన చిత్రం దొబారా(Dobara) ఆగ‌స్ట్ 19న రిలీజ్ అవుతుంది. అయితే తమ సినిమా ప్రమోషన్ల కోసం చాలామంది కాఫీ విత్‌ కరణ్‌ షోకి హాజరవుతున్నా తాప్సీ అండ్‌ టీం మాత్రం వెళ్లలేదు. ప్రస్తుతం ఈ టాపిక్‌ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అందుకే ఆ టాక్‌ షోకు వెళ్లడం లేదు..

ఓ ర‌కంగా బాలీవుడ్‌లో (Bollywood) హాట్ టాపిక్‌గానే మారింది. ఇదే ప్రశ్నను తాప్సీని అడగ్గా.. తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ షో పై ఘాటు విమర్శలు చేసింది. ‘కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు హిందీ చిత్ర పరిశ్రమలో వైరలవుతున్నాయి. అయితే క‌ర‌ణ్ పై తాప్సీ ఇంత ఘాటుగా రియాక్ట్ కావ‌టానికి కార‌ణమేంటోనని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే ఛాట్‌ షోలో క‌ర‌ణ్ అడిగే సెక్స్ లైఫ్ ప్రశ్నలకు స‌మాధానం చెప్పడానికి ఇష్టం లేక‌నే తాప్సీ ఇలా మాట్లాడిందని చాలామంది భావిస్తున్నారు. కాగా స్పానిష్ చిత్రం మిరాజ్‌కి రీమేక్‌గా రూపొందిన దొబారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనురాగ్‌ కశ్యప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..