Laal Singh Chaddha: తమిళ్ హీరో‏లపై అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. విజయ్‏ను చూస్తే అలా అనిపిస్తుందంటూ..

లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండగా.. తమిళ్ వెర్షన్ ను ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు. ఇందులో చైతూ, అమీర్ ఆర్మీ ఆఫీసర్స్ పాత్రలలో కనిపించనున్నారు.

Laal Singh Chaddha: తమిళ్ హీరో‏లపై అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. విజయ్‏ను చూస్తే అలా అనిపిస్తుందంటూ..
Aamir Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 08, 2022 | 2:46 PM

బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్‏కు రీమేక్‏గా వస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య సౌత్ అబ్బాయి బోడి బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా.. దక్షిణాది రాష్ట్రాలలో సందడి చేస్తున్నారు మిస్టర్ ఫర్ఫెక్ట్. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. కోలీవుడ్ హీరోస్ దలపతి విజయ్, అజిత్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. “విజయ్ అద్భుతమైన నటుడు. అతనిని చూడగానే అన్న అనే భావన కలుగుతుంది. మా కుటుంబసభ్యుడు అనిపిస్తుంది. గతంలో రజినీ సర్‏ను చూసినప్పుడు కూడా ఇదే అనుభూతి వచ్చింది. అలాగే.. అజిత్ కుమార్‏లో ఏదో తెలియని శక్తి ఉంది. అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని నేను ఇష్టపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండగా.. తమిళ్ వెర్షన్ ను ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు. ఇందులో చైతూ, అమీర్ ఆర్మీ ఆఫీసర్స్ పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ చెన్నైలో జరుగుతున్నాయి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?