Alia Bhatt: ఇన్‏స్టాలో ఒక్క పోస్ట్ చేస్తే అలియా ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

తాజాగా అలియాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇన్‏స్టాలో ఏదైనా కమర్షియల్ యాడ్ లేదా పోస్ట్ చేయడానికి

Alia Bhatt: ఇన్‏స్టాలో ఒక్క పోస్ట్ చేస్తే అలియా ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Alia Bhatt
Follow us

|

Updated on: Aug 08, 2022 | 4:20 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది అలియా భట్ (Alia Bhatt). అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా మెప్పించిన ఈ చిన్నది.. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సీత పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇటీవల తన ప్రియుడు రణబీర్ కపూర్‏ను పెళ్లాడిన అలియా.. రెండునెలలకే ప్రెగ్నెన్సీ న్యూస్ షేర్ చేసి షాకిచ్చింది. ఇక బేబీ బంప్‏తోనూ షూటింగ్స్‏లో పాల్గోంటున్న అలియా పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా అలియాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇన్‏స్టాలో ఏదైనా కమర్షియల్ యాడ్ లేదా పోస్ట్ చేయడానికి దాదాపు రూ.80 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తుందని తెలుస్తోంది. ఇన్‏ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం అలియా దాదాపు ఒక్కపోస్ట్ కు రూ. కోటి తీసుకుంటుందట. ఆమెకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో 68.5 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అలియా కేవలం 493 మందిని మాత్రమే ఫాలో అవుతుంది. ఇక రానున్న రోజుల్లో అలియా మరింత పారితోషికం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.