- Telugu News Photo Gallery Commonwealth Games 2022: India ends campaign with 61 medals; ranked 4th in table
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట! ప్రపంచదేశాల సరసన 4వ స్థానం..
ఈ ఏడాది జూలై 28న ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు సోమవారం (ఆగస్టు 8)తో ముగిశాయి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఆటగాళ్లు..
Updated on: Aug 09, 2022 | 10:26 AM

ఈ ఏడాది జూలై 28న ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు సోమవారం (ఆగస్టు 8)తో ముగిశాయి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. భారత్‌కు పతకాల పంట వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సాధించిన స్వర్ణంతో ప్రారంభమై హాకీలో రజత పతకంతో ముగిసింది.

కామన్వెల్త్ క్రీడల్లో 18వ సారి పాల్గొన్న భారత్ నుంచి 104 మంది పురుషులు, 103 మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా వీరోచితంగా ఆటలాడి దాదాపు 61 పతకాలు సాధించారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు సాధించారు. పురుషులు 35 సాధించగా, మహిళలు 26 పతకాలు గెలుపొందారు. ఇక కామన్వెల్త్ 2022 గేమ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది.

రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు లభించాయి. వీటిల్లో 6 గోల్డ్ మెడళ్లు, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు వచ్చాయి.

వెయిట్‌లిఫ్టింగ్‌లో 10, టేబుల్ టెన్నిస్‌లో 7, బాక్సింగ్‌లో 7, బ్యాడ్మింటన్‌లో 6, అథ్లెటిక్స్‌లో 8, లాన్ బాల్‌లో 2, పారా లిఫ్టింగ్‌లో 1, జూడోలో 3, హాకీలో 2, క్రికెట్‌లో1, స్క్వాష్‌లో 2 పతకాల చొప్పున వచ్చాయి.

గతేడాది గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో భారత్ 66 పతకాలు సాధించింది. ఇందులో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలు సాధించారు. ఈసారి షూటింగ్‌లో భారత్‌కు 16 పతకాలు రావడం విశేషం. ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన భారత ఆటగాళ్లు ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో దేశ ఖ్యాతిని నిలబెట్టారు.





























