Mahesh Babu: పోకిరి మాస్‌ జాతర.. కొత్త సినిమా రిలీజ్‌కు కూడా ఇంత హంగామా ఉండదేమో.. ఫ్యాన్సా..మజాకా

Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఎన్ని సినిమాల్లో నటించి ఉండవచ్చు. బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టిండొచ్చు. ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టి ఉండవచ్చు. అయితే పోకిరి ..

Mahesh Babu: పోకిరి మాస్‌ జాతర.. కొత్త సినిమా రిలీజ్‌కు కూడా ఇంత హంగామా ఉండదేమో.. ఫ్యాన్సా..మజాకా
Mahesh Babu Pokiri
Follow us
Basha Shek

|

Updated on: Aug 09, 2022 | 11:49 AM

Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఎన్ని సినిమాల్లో నటించి ఉండవచ్చు. బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టిండొచ్చు. ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టి ఉండవచ్చు. అయితే పోకిరి (Pokiri) సినిమాకు మాత్రం ఉండే క్రేజ్ వేరు. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, హీరోయిన్ గా ఇలియానా నటించింది. 2006 ఏప్రిల్‌28న విడుదలైన ఈ చిత్రం మహేశ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అప్పట్లోనే 80 కోట్లు వసూలు చేసి టాలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పటికీ టీవీలు, యూట్యూబ్‌లో ఈ సినిమా వస్తే కళ్లప్పగించి చూసేవారు చాలామంది ఉన్నారు. అలా సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ సొంతం చేసుకున్న పోకిరి సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి అడుగుపెట్టింది. అదికూడా 4కె వెర్షన్‌ ప్రింట్‌తో. మహేశ్‌బాబు పుట్టిన రోజు (ఆగస్టు 9) సందర్భంగా ఈరోజు ప్రపంచ ‍వ్యాప్తంగా 300వరకు స్పెషల్‌ షోలతో థియేరట్స్‌లో గ్రాండ్‌గా ఈ సినిమాను రీ రిలీజ్‌ చేశారు.

కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సహా అన్ని చోట్ల టికెట్స్‌ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. పైగా కొత్త సినిమా ధరలతోనే ఈ టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. ఇక హైదరాబాద్‌ లోనూ మొత్తంగా 30 షోలకు అడ్వాన్స్ బుకింగ్ చేయగా, అన్నీ ఫుల్ అయిపోయాయి. ప్రసాద్ మల్టీప్లె్క్స్ లోనే 8 షోల టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోయాయి. కాగా థియేటర్లలో పోకిరి సినిమాను చూసిన అభిమానులు ఆ విజువల్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ముఖ్యంగా సినిమాకు హైలెట్‌గా నిలిచే మహేశ్‌ బాబు ఎంట్రీ సీన్‌ నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఇక సోషల్‌ మీడియాలోనూ హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ బాబు అనే ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..