Shoaib Akthar: ఆస్పత్రిలో చేరిన మాజీ ఫాస్ట్‌ బౌలర్‌..11 ఏళ్లుగా ఆ నొప్పిని భరిస్తున్నానంటూ ఎమోషనల్‌

Shoaib Akhtar:పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అఖ్తర్‌ (Shoaib Akthar) ఉన్నట్లుండి ఆస్పత్రిలో చేరాడు. గత కొన్నేళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న అతను ఆస్పత్రిలో చేరి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆస్ట్రేలియా రాజాధాని మెల్‌బోర్న్‌ (Melbourne) లోని

Shoaib Akthar: ఆస్పత్రిలో చేరిన మాజీ ఫాస్ట్‌ బౌలర్‌..11 ఏళ్లుగా ఆ నొప్పిని భరిస్తున్నానంటూ ఎమోషనల్‌
Shoaib Akhtar
Follow us

|

Updated on: Aug 10, 2022 | 5:07 PM

Shoaib Akhtar:పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అఖ్తర్‌ (Shoaib Akthar) ఉన్నట్లుండి ఆస్పత్రిలో చేరాడు. గత కొన్నేళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న అతను ఆస్పత్రిలో చేరి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆస్ట్రేలియా రాజాధాని మెల్‌బోర్న్‌ (Melbourne) లోని ఒక హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్న అక్తర్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 444 వికెట్లు పడగొట్టాడు అక్తర్‌. అయితే మోకాలి గాయం కారణంగా అనూహ్యంగా క్రికెట్‌ నుంచి వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈక్రమంలో ఎన్నో ఏళ్ల తర్వాత మోకాలి సర్జరీ చేయించుకున్న అక్తర్‌ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు.

వీల్‌చైర్‌లోనే ఉండే వాడిని.. ‘ సుమారు 11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నా. నిజం చెప్పాలంటే నేను క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే మోకాలి నొప్పితో మరో నాలుగైదేళ్లు క్రికెట్‌ ఆడి ఉంటే మాత్రం కచ్చితంగా జీవితాంతం వీల్‌చైర్‌లోనే ఉండిపోయే వాడిని. ఎలాగోలా ఇన్నేళ్లకు సర్జరీ చేయించుకున్నా. కాస్త నొప్పిగా ఉంది. మీ ప్రార్థనలతో నేను తొందరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను. ఇదే నా చివరి సర్జరీ కూడా కావాలని కోరుకుంటున్నా’ అని భావోద్వేగానికి గురయ్యాడు అక్తర్‌. కాగా బుల్లెట్‌ లాంటి బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఘనత ఈ ఫాస్ట్‌ బౌలర్‌ది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన బౌలర్‌గా రికార్డు ఇప్పటికీ షోయబ్‌ పేరిటనే ఉంది. అక్తర్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 14 టీ20ల్లో 21 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 46 టెస్టుల్లో 178 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు