Axar Patel: సాగర తీరంలో సరదా సరదాగా.. కాబోయే సతీమణితో టీమిండియా ఆల్ రౌండర్ రొమాంటిక్ డేట్.. ఫొటోలు వైరల్
Axar Patel- Meha:టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో ఉన్నాడు. క్రికెట్ షెడ్యూల్ నుంచి కాస్త విశ్రాంతి లభించడంతో కాబోయే సతీమణి మెహా పటేల్ (Meha)తో కలిసి రొమాంటిక్ డేట్‌కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి సాగర తీరంలో బీచ్ అందాలను మనసారా ఆస్వాదించారు...
Axar Patel- Meha:టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో ఉన్నాడు. క్రికెట్ షెడ్యూల్ నుంచి కాస్త విశ్రాంతి లభించడంతో కాబోయే సతీమణి మెహా పటేల్ (Meha)తో కలిసి రొమాంటిక్ డేట్‌కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి సాగర తీరంలో బీచ్ అందాలను మనసారా ఆస్వాదించారు. ప్రేమ ముచ్చట్లను చెప్పుకుంటూ మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహా సోషల్ మీడియా పంచుకుంది. కాబోయే భర్త అక్షర్‌తో రొమాంటిక్‌గా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ‘ నవ్వు అలవి కాదు.. ఆ సముద్రంలో భాగానివి’ అంటూ ప్రేమ కవిత్వం రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కాగా మెహా పటేల్ అక్షర్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మొగ్గ తొడిగింది. ఆపై పెళ్లి దాకా వెళ్లింది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
త్వరలోనే ఏడడుగులు.. ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించడంతో ఈ ఏడాది జనవరి 20న అక్షర్ పటేల్- మేహా పటేల్‌ల ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. ఇక టీమిండియాలో అక్షర్ ఆల్‌రౌండర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఇటీవల ముగిసిన విండీస్ పర్యటనలో అతను అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో ఆఖరి బంతికి సిక్సర్ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. తద్వారా కరేబియన్ గడ్డపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా త్వరలో ఈ ఆల్‌రౌండర్ జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్నాడు. ఆగస్ట్ 18న ఈ టూర్ ప్రారంభం కానుంది. శిఖర్ ధావన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే, ఆసియా కప్‌కు ఈ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటు దక్కలేదు. స్టాండ్‌బైగా మాత్రమే అక్షర్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..