Theatre- OTT Movies: డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా.. ఈ వారం థియేటర్లు, ఓటీటీ సినిమాలివే

Telugu movies: మంచి హిట్‌ కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన టాలీవుడ్‌కు బింబిసార, సీతారామం చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు ఇదే ఊపును

Theatre- OTT Movies: డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా.. ఈ వారం థియేటర్లు, ఓటీటీ సినిమాలివే
Theatare Ott Movies
Basha Shek

|

Aug 09, 2022 | 1:32 PM

Telugu movies: మంచి హిట్‌ కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన టాలీవుడ్‌కు బింబిసార, సీతారామం చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు ఇదే ఊపును కొనసాగించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. కంటెంట్‌ బాగుంటే కలెక్షన్లకు కొదవలేదని ఈ రెండు సినిమాలు నిరూపించడంతో దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను కూడా థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఓటీటీలోనూ కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి ఆగస్టు రెండో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

బాలీవుడ్ ఆశలన్నీ లాల్‌సింగ్‌పైనే..

Laal Singh Chaddha

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రం లాల్‌సింగ్‌ చడ్డా. టాలీవుడ్‌ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. బెబో హీరోయిన్‌గా నటించింది. హాలీవుడ్‌ సినిమా ఫారెస్ట్‌ గంప్‌ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న లాల్‌సింగ్‌ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Akshay

రక్షాబంధన్‌

అక్షయ్‌కుమార్‌, భూమి పెడ్నేకర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం రక్షాబంధన్‌. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాఖీ పండగను పురస్కరించుకుని ఆగస్టు 11న విడుదల కానుంది రక్షాబంధన్‌.

మాచర్ల నియోజకవర్గం

Macherla Niyojakavargam

టాలీవుడ్‌ యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి హీరోయిన్‌. ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. నితిన్‌ ఇందులో కలెక్టర్‌గా కనిపించనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక రా రా రెడ్డి అంటూ అంజలి ఐటమ్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

కార్తికేయ 2

Karthikeya 2నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ కార్తికేయ. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఇప్పుడు ఈ మిస్టరీని కొనసాగించేందుకు కార్తికేయ 2 గా మళ్లీ మన ముందుకు వస్తున్నాడు నిఖిల్‌. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. ఈసారి శ్రీకృష్ణుడి ద్వారక నగరంలో దాగున్న రహస్యాలను ఛేదించనున్నట్లు ట్రైలర్‌లో చూపించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు13న కార్తికేయ2 థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

ఓటీటీలో సినిమాలివే..

ఆహాలో

 • మాలిక్‌ (తెలుగు)- ఆగస్టు 12
 • మహా మనిషి (తెలుగు)- ఆగస్టు 12
 • ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌-4 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 12

సోనీ లివ్‌

Gargi Movie Review and ratings Sai Pallavi praised for her best performance

Gargi Movie

గార్గి (తెలుగు)- ఆగస్టు 12

డిస్నీ+హాట్‌ స్టార్‌

The Warriorr

ది వారియర్‌ (తెలుగు/తమిళ్‌)- ఆగస్టు 11

జీ5 హలో వరల్డ్‌ (తెలుగు వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 12

నెట్‌ఫ్లిక్స్‌

Ott

 • హ్యాపీ బర్త్‌డే (తెలుగు)- – ఆగస్టు 8
 • నరూటో: షిప్పుడెన్‌ సీజన్‌-1- ఆగస్టు 8
 • ఐ జస్ట్‌ కిల్డ్‌ మై డాడ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 9
 • ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ సీజన్‌2 (వెబ్ సిరీస్‌)- ఆగస్టు 10
 • లాకీ అండ్‌ కీ సీజన్‌-3 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 10
 • బ్యాంక్‌ రాబర్స్‌: ది లాస్ట్ గ్రేట్‌ హెయిస్ట్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 10
 • దోతా: డ్రాగన్స్‌ బ్లడ్‌: బుక్‌ 3 (హాలీవుడ్‌)- ఆగస్టు 11
 • నెవ్వర్‌ హేవ్‌ ఐ ఎవర్‌ సీజన్‌-3 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 12
 • బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌: సీజన్‌-8 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 13
 • గాడ్జిల్లా vs కాంగ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 14

అమెజాన్‌ ప్రైమ్‌

ఇవి కూడా చదవండి

 • సోనిక్‌ ది ఎడ్జ్‌హాగ్‌2 (హాలీవుడ్‌)- ఆగస్టు 10
 • ది లాస్ట్‌ సిటీ (హాలీవుడ్‌)- ఆగస్టు 10
 • మలయాన్‌ కుంజు (మలయాళం)- ఆగస్టు 11
 • ఎ లీగ్‌ ఆఫ్‌ దైర్‌ వోన్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 12
 • కాస్మిక్‌ లవ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 12

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu