AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వంటకాన్ని వయాగ్రాతో పోల్చతారు.. తింటే ఆ శక్తి తెగ పెరుగుతుందట

వయాగ్రాతో పోల్చబడుతూ ప్రాచుర్యం పొందిన ఉజ్బెక్ పలావ్, కేవలం ఒక వంటకం కాదు, ఉజ్బెకిస్తాన్ సంస్కృతిలో అంతర్భాగం. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ కాలం నాటి చరిత్రను కలిగి ఉంది, కుటుంబ వేడుకల్లో, సామాజిక సందర్భాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గురువారాల్లో దీనిని తినడం పురుషుల సంతానోత్పత్తికి దోహదపడుతుందని స్థానికులు విశ్వసిస్తారు.

ఈ వంటకాన్ని వయాగ్రాతో పోల్చతారు.. తింటే ఆ శక్తి తెగ పెరుగుతుందట
Uzbek Plov
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2026 | 5:39 PM

Share

వయాగ్రాతో పోల్చబడుతూ ప్రాచుర్యం పొందిన వంటకం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే, ఉజ్బెకిస్తాన్ పలావ్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఉజ్బెకిస్తాన్ సంస్కృతి, చరిత్ర, సామాజిక జీవనంలో విడదీయరాని భాగం.

చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత:

పలావ్, ఉజ్బెకిస్తాన్ జాతీయ వంటకం. అక్కడి ప్రజలు వారానికోసారైనా దీనిని తింటారు. కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు వంటి అన్ని సందర్భాల్లోనూ దీనిని వడ్డిస్తారు. హజ్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన ముస్లింల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. కొందరు చరిత్రకారులు పలావ్ వంటకాన్ని తొలుత అలెగ్జాండర్ ది గ్రేట్ కోసం కనిపెట్టినట్లు చెబుతుంటారు. సెంట్రల్ ఆసియా యుద్ధ సన్నాహకాల్లో భాగంగా సైన్యం కోసం ఏదైనా రుచికరమైన ఆహారం తయారు చేయమని ఆదేశించడంతో ఈ వంటకం రూపొందించబడింది. దీనికి చారిత్రక రికార్డులు లేనప్పటికీ, 9-10వ శతాబ్దాల నాటికి పలావ్ ఈ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిందని ఆహార చరిత్రపై ఆసక్తి ఉన్న కొందరు పేర్కొన్నారు. వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో వరి ప్రధాన పంటగా ఉండటం, శారీరక శ్రమ అవసరం కావడంతో పలావ్ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే వంటకంగా మారింది. ఇటీవల, యునెస్కో దీనిని సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది.

పలావ్ రకాలు, తయారీ:

ఉజ్బెకిస్తాన్‌లో 100 కంటే ఎక్కువ రకాల పలావ్‌లు ఉన్నాయి. వంటకాలు ప్రాంతం, సీజన్ ప్రకారం విభిన్నంగా ఉంటాయి, అయితే ప్రతి రకంలోనూ కీలకమైన పదార్థాలు ఉంటాయి. ఈ వంటకం పూర్తి పేరు ఓష్ పలావ్. రాజధాని తాష్కెంట్ పక్కనున్న యునుసాబాద్ ప్రాంతంలోని బేష్ కోజోన్, మధ్య ఆసియాలోని అతిపెద్ద పలావ్ రెస్టారెంట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ప్రతిరోజూ 5,000 నుంచి 8,000 మందికి సేవలు అందిస్తోంది. ఇక్కడ ఖజాన్ అని పిలిచే చెక్క మంటలపై పలావ్ తయారు చేస్తారు. సంప్రదాయం ప్రకారం పలావ్ ప్లేట్‌లో నాన్ (రొట్టె) తప్పనిసరి. ఇళ్లలో మహిళలు పలావ్ తయారు చేసినప్పటికీ, రెస్టారెంట్లలో ఓష్‌పాజ్ అని పిలిచే పురుష చెఫ్‌లు దీనిని వండుతారు. భారీ పరిమాణంలో పలావ్ తయారు చేయడానికి కఠినమైన శారీరక శ్రమ అవసరం కాబట్టి ఇది పురుషుల పని అని అక్కడి వ్యక్తులు చెబుతుంటారు. అతిథికి పలావ్ రుచిగా అనిపించకపోతే, అది చెఫ్‌లకు అవమానకరంగా భావిస్తారు. పలావ్ తయారీకి ముందుగా మాంసం  వేయించి, తర్వాత తెల్ల, పసుపు క్యారెట్లు, ఉల్లిపాయ, బియ్యం, నీరు, ఉప్పు, మిరియాలు, పసుపు, ప్రధానంగా జీలకర్ర వంటి మసాలా దినుసులను జోడిస్తారు. భారత్ నుంచి సిల్క్ రోడ్ వెంట జీలకర్ర ఉజ్బెకిస్తాన్‌కు చేరుకుంది. బేష్ కోజోన్ చైఖానా పలావ్‌లో, వంటకాన్ని ఉడికించే ముందు చిక్ పీస్, కిస్మిస్‌లు కలుపుతారు, ఆ తర్వాత నాలుగు గంటల పాటు నెమ్మదిగా ఉడికిస్తారు.

“వయాగ్రా” అనుబంధం, నమ్మకాలు:

ఉజ్బెకిస్తాన్‌లో పలావ్ చేయడానికి, తినడానికి గురువారం, ఆదివారాలు ముఖ్యమైన రోజులుగా పరిగణిస్తారు. గురువారం రోజున పలావ్ తినడానికి ముఖ్య కారణం, దానిలో పురుషులకు వీర్యాన్ని వృద్ధి చేసే బలమైన లక్షణాలు ఉన్నాయని విశ్వసించడం. గర్భం ధరించడానికి గురువారం మంచి రోజుగా భావిస్తారు కాబట్టి అదే రోజు పలావ్ తినడం సరైనదని అక్కడి నిపుణులు పేర్కొన్నారు. ఖజాన్ కింద నుంచి నూనెను కొన్నిసార్లు సహజ వయాగ్రా రూపంలో తాగుతారట. చాలామంది చెఫ్‌లు కస్టమర్లకు అదనపు లైంగిక శక్తి కోసం ఉత్తమమైన మాంసాన్ని గురువారం అందించడానికి నిల్వ చేస్తారని సమాచారం.. గురువారాల్లో గర్భం ధరించే సంప్రదాయం దేశంలోని బలమైన మత విశ్వాసాలతో ముడిపడి ఉంది. పలావ్ ఉజ్బెకిస్తాన్ సంస్కృతికి జీవం పోస్తుంది, దాని రుచి చరిత్రను, సంప్రదాయాలను, తరతరాల నమ్మకాలను ప్రతిబింబిస్తుంది.

Follow Us
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..
19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు 'లజ్జా' రచయిత్రి తస్లీమా నస్రీన్ రాక..
19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు 'లజ్జా' రచయిత్రి తస్లీమా నస్రీన్ రాక..
పచ్చిమిర్చి vs ఎండుమిర్చి.. ఆరోగ్యానికి ఏది అమృతం.. ఏది విషం?
పచ్చిమిర్చి vs ఎండుమిర్చి.. ఆరోగ్యానికి ఏది అమృతం.. ఏది విషం?
ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్..
ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్..