ICC T20 Rankings: బాబర్ ఈసారి బతికిపోయాడు.. సూర్యకు మళ్లీ సేమ్ ప్లేస్.. దుమ్మురేపిన యంగ్ స్పిన్నర్
ICC T20 Rankings: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) బతికిపోయాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ICC T20 Rankings: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) బతికిపోయాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గత కొన్ని రోజులుగా పొట్టి ఫార్మాట్‌లో పరుగులు వర్షం కురిపిస్తూ బాబర్ స్థానానికి ఎసరుపెట్టేలా కనిపించిన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజా ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌కు సూర్యకు విశ్రాంతినివ్వడం బాబర్‌కు బాగా కలిసొచ్చింది ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఎస్కేవై ఆడి మంచి స్కోరు నమోదు చేసి ఉంటే నంబర్ 1గా నిలిచేవాడు. అయితే అదేమీ జరగలేదు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 805 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్), మర్కరమ్(దక్షిణాఫ్రికా), డేవిడ్ మలాన్(ఇంగ్లండ్) కొనసాగుతున్నారు. కాగా వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో మొత్తంగా 115 పరుగులు సాధించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. 66వ స్థానం నుంచి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు.
అదరగొట్టిన బిష్ణోయ్..
ఇదిలా ఉంటే ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన అతను ఏకంగా టాప్-50లోకి దూసుకొచ్చాడు. మొత్తం 481 పాయింట్లతో కెరీర్ అత్యుత్తమ 44వ ర్యాంకు సాధించాడు. ఇక పేసర్ హర్షల్ పటేల్ ఒక స్థానం దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 9వ ర్యాంకుకు దిగజారాడు. టీ20 బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ 792 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..