Darshan Kumar: నువ్వు ఇక కనిపించవ్.. నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.. ఆడియో టేపులు కలకలం
Darshan Kumar: కన్నడ స్టార్ హీరో దర్శన్ కుమార్ (Darshan Kumar) వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా విషయంలో తనను బెదిరించారంటూ అతనిపై ఓ నిర్మాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Darshan Kumar: కన్నడ స్టార్ హీరో దర్శన్ కుమార్ (Darshan Kumar) వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా విషయంలో తనను బెదిరించారంటూ అతనిపై ఓ నిర్మాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రెండేళ్ల క్రితం భరత్ అనే వ్యక్తి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ పేరుతో ఓ సినిమాను ప్రారంభించారు. అందులో విలన్ పాత్రకు దర్శన్ బంధువైన ధ్రువన్‌ను తీసుకున్నారు. అయితే షూటింగ్ మధ్యలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చిత్రీకరణ ఆలస్యమైనట్లు ధ్రువన్ వద్ద భరత్ వాపోయాడు. దీంతో ధ్రువన్ వెంటనే దర్శన్‌కు కాల్ కలిపారు. ఇదే సమయంలో తనను బెదిరించినట్లు భరత్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ధ్రువన్ ఈ విషయం చెప్పటానికి దర్శన్‌కు ఫోన్ చేశారు. అదే సమయంలో ఫోన్‌లో నిర్మాతను బెదిరించినట్లు భరత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బెంగళూరులోని కెంగేరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి దర్శకుడు ఆంథోని, కెమెరామ్యాన్‌లను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా దీనికి సంబంధించి దర్శన్ మాట్లాడిన ఓ ఆడియో టేపు సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. ‘నీవు ఇక ఉండవు… ఏమైనా చేయాలంటే చెప్పే చేస్తా రెడీగా ఉండు. నీవు కనపడకుండా పోతావు’ అని ఆ ఆడియో టేపులో ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం శాండల్‌వుడ్‌లో కలకలం రేగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..