Fact Check: బీసీసీఐ చైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా.. ఇందులో నిజమెంత.?

బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశాడంటూ.. నూతన అధ్యక్షుడిగా జైషా పదవీ బాధ్యతలను చేపట్టనున్నాడని పలు వార్తలు..

Fact Check: బీసీసీఐ చైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా.. ఇందులో నిజమెంత.?
Sourav Ganguly
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 11, 2022 | 1:55 PM

బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశాడంటూ.. నూతన అధ్యక్షుడిగా జైషా పదవీ బాధ్యతలను చేపట్టనున్నాడని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనాన్ని కొన్ని మీడియా హౌస్‌లు కూడా కవర్ చేయడంతో.. ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా సంచలనం రేగింది. అయితే ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని దాదా ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ట్వీట్ ఓ ఫేక్ బీసీసీఐ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిందని తేల్చారు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయలేదని.. ఈ పుకారును ఎవ్వరూ నమ్మొద్దని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వార్తపై బీసీసీఐ ఇంకా స్పందించాల్సి ఉంది.

సదరు వైరల్ అయిన ట్వీట్ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఇదే.. 

ఆపై అకౌంట్ వివరణ ఇదే..