Cricket: 3 మ్యాచ్‌ల్లో 384 రన్స్.. 34 ఫోర్లు, 11 సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. రికార్డులే.. రికార్డులు!

స్టీఫెన్ ఎస్కినాజీ.. ఈ టోర్నమెంట్‌లో మిడిల్‌సెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి..

Cricket: 3 మ్యాచ్‌ల్లో 384 రన్స్.. 34 ఫోర్లు, 11 సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. రికార్డులే.. రికార్డులు!
Stephen
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 11, 2022 | 12:00 PM

రాయల్ లండన్ కప్ 2022లో మిడిల్‌సెక్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాలను నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ ఆ జట్టు ఓపెనర్ స్టీఫెన్ ఎస్కినాజీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం ఒక ఎత్తయితే.. చివరి రెండు మ్యాచ్‌లలోనూ విజయం అందుకోవడానికి అతడి మెరుపు బ్యాటింగ్ తోడవ్వడం మరో ఎత్తు. నిన్న(ఆగష్టు 10) సర్రేతో జరిగిన మ్యాచ్‌లో స్టీఫెన్ ఎస్కినాజీ (136 బంతుల్లో 182; 17 ఫోర్లు, 6 సిక్సర్లు)తో అదిరిపోయే సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో మిడిల్‌సెక్స్ జట్టు.. సర్రేపై 102 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్రే జట్టు.. తొలుత మిడిల్‌సెక్స్ టీంను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్టీఫెన్ ఎస్కినాజీ (136 బంతుల్లో 182; 17 ఫోర్లు, 6 సిక్సర్లు) అదిరిపోయే సెంచరీతో, పీటర్ మాలన్ (60 బంతుల్లో 64; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. సర్రే జట్టులో మెకేర్ర్ 3 వికెట్లు, మజిద్, స్టీల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ఉమేష్ యాదవ్(3/52), బాంబెర్(3/46), ఆండర్సన్(2/48) విజృంభించడంతో లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన సర్రే జట్టు నిర్ణీత ఓవర్లకు 249 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులో ర్యాన్ పటేల్(118) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో మిడిల్‌సెక్స్ 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ గెలుపుతో మిడిల్‌సెక్స్ జట్టు గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

3 మ్యాచ్‌ల్లో 384 రన్స్.. 34 ఫోర్లు, 11 సిక్సర్లు..

స్టీఫెన్ ఎస్కినాజీ.. ఈ టోర్నమెంట్‌లో మిడిల్‌సెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి.. జట్టుకు విజయం అందించడమే కాకుండా.. తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్ధులను బెంబేలెత్తిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 56 పరుగులు చేసిన స్టీఫన్.. ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో 146, 182 పరుగులతో అదరగొట్టాడు. వెరిసి 3 మ్యాచ్‌లలో 384 పరుగులు చేశాడు. ఈ సమయంలో 34 ఫోర్లు, 11 సిక్సర్లతో ఒక అర్ధ సెంచరీ, 2 సెంచరీలు నమోదు చేశాడు.