Allu Arjun: దటీజ్ పుష్పరాజ్.. ఆ యాడ్ కోసం బన్నీకి 10 కోట్ల ఆఫర్.. అయినా నో చెప్పేశాడు
Allu Arjun: టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు (Allu Arjun). ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడీ స్టార్ హీరో. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టైలిష్ స్టార్..
ఒక్క ఫోటోతోనే నేషనల్ లెవల్‌లో రచ్చ చేసిన బన్నీ ఫుల్ సినిమా ఇదే లుక్‌లో కనిపిస్తే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్.
Allu Arjun: టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు (Allu Arjun). ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడీ స్టార్ హీరో. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టైలిష్ స్టార్ మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ కోట్లు గడిస్తున్నాడు. ఇప్పటికే పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈక్రమంలో ఒక్కోయాడ్‌కు రూ7.5 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఈక్రమంలో అల్లు అర్జున్ కున్న క్రేజ్‌ను ఓ గుట్కా అండ్ లిక్కర్ కంపెనీ కూడా వినియోగించుకోవాలనుకుందట. తమ సంస్థ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఏకంగా రూ.10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆఫర్ చేశారట. అయితే ఐకాన్ స్టార్ మాత్రం ఆ యాడ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. జనాల ఆరోగ్యానికి హానికరం కలిగించే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశం లేని బన్నీ ఆ భారీ ఆఫర్‌ను ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
#AlluArjun denied a ₹10 cr offer from gutka and liquor brand.
కాగా ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ హీరోది మంచి మనసంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. పుష్ప- ది రూల్ పేరుతో మొదటి భాగం కంటే మరింత గ్రాండియర్‌గా సుకుమార్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో నటించిన వారితో పాటు మరికొందరు ఫేమస్ యాక్టర్లను ఎంపిక చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.