Jr. Trisha: త్రిషను తలపిస్తున్న మైసూర్‌ అమ్మాయి.. అచ్చం త్రిషలా.. షాకవుతున్న నెటిజన్స్..

Jr. Trisha: త్రిషను తలపిస్తున్న మైసూర్‌ అమ్మాయి.. అచ్చం త్రిషలా.. షాకవుతున్న నెటిజన్స్..

Anil kumar poka

|

Updated on: Aug 11, 2022 | 9:39 AM

ఈ ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అలా అచ్చం ఒక వ్యకిలా ఉండే మరో వ్యక్తి.. లేదా వారి పోలికలు ఉండే మనుషులను చాలా సందర్భాల్లోనే నేరుగా చూసి ఉంటాం. అయితే


ఈ ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అలా అచ్చం ఒక వ్యకిలా ఉండే మరో వ్యక్తి.. లేదా వారి పోలికలు ఉండే మనుషులను చాలా సందర్భాల్లోనే నేరుగా చూసి ఉంటాం. అయితే సెలబ్రెటీల పోలికలతో ఉండే వారు కూడా ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి వారి ఫోటోస్, వీడియోస్ చూస్తున్నాం. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దక్షిణాది అందాల తార దివంగత హీరోయిన్ సౌందర్య పోలికలతో ఉన్న అమ్మాయిలను చూశాం. ఇక ఇప్పుడు దీపిక విజయ్ అనే అమ్మాయి కూడా అదే కోవలోకి వచ్చింది.ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిని చూస్తే.. త్రిష కాస్త సన్నబడిందా ?.. అనే సందేహాం కలుగుతుంది కదూ. కానీ ఆ అమ్మాయి పేరు దీపిక విజయ్. మైసూర్‏కు చెందిన ఈమె చూడటానికి అచ్చం త్రిష మాదిరిగానే ఉంది. ఈమె ఇన్ స్టా ఖాతాలలో సైతం త్రిష సినిమాలు.. రీల్స్ చేస్తుంది. దీంతో అచ్చం త్రిషలా ఉండడంతో దీపిక ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. ఈమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ దీపికా ప్రొపైల్ ఓపెన్ చేసి షాకవుతున్నారు. కేవలం ఒక్క ఫోటోలో మాత్రమే కాదు.. దాదాపు అన్ని వీడియోస్, ఫోటోలలోనూ త్రిషలాగే కనిపిస్తుంది. దీంతో మీరు త్రిష చెల్లా ? అంటూ.. లుక్ లైక్ త్రిష్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..