Skeleton: రూ.48.5 కోట్లు పలికిన అస్థిపంజరం.. ఎందుకో.? అందులోని స్పెషాలిటీ ఏంటో మీరే చూడండి…
కొన్ని కోట్ల ఏళ్ల క్రిందటి ఓ అస్థిపంజరం ఏకంగా నలభై ఎనిమిదిన్నర కోట్ల ధరపలికింది. వామ్మో అస్థిపంజరమేంటి.. కోట్లు ధర పలకడమేంటి అనుకుంటున్నారా... అవును..
కొన్ని కోట్ల ఏళ్ల క్రిందటి ఓ అస్థిపంజరం ఏకంగా నలభై ఎనిమిదిన్నర కోట్ల ధరపలికింది. వామ్మో అస్థిపంజరమేంటి.. కోట్లు ధర పలకడమేంటి అనుకుంటున్నారా… అవును.. అది సాదా సీదా అస్థి పంజరం కాదు మరి.. డైనోసార్లలో టీరెక్స్ అని పిలువబడే భయంకరమైన టైరనోసారస్ రెక్స్ కంటే ముందునాటి గోర్గోసారస్ డైనోసార్ అస్థి పంజరం. అంతేకాదు.. ఇది టి రెక్స్ కంటే కూడా వేగంగా కదులుతూ దాడి చేయగలదని, దీని బలం కూడా చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.తొలితరం డైనోసార్లు తిరుగాడిన క్రేటాషియస్ కాలానికి చెందిన భయానక మాంసాహార డైనోసార్లలో గొర్గోసారస్ ఒకటని.. అమెరికా, కెనడా ప్రాంతాల్లో జీవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గొర్గోసారస్ అస్థి పంజరాన్ని 2018లో అమెరికాలోని మోంటానాలో జుడిత్ నది సమీపంలో గుర్తించారు. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న ఈ అస్థి పంజరం 7.7 కోట్ల ఏళ్ల కింద తిరుగాడిన డైనోసార్ దిగా నిర్ధారించారు. ప్రఖ్యాత సోత్ బీ వేలం శాల జులై 21 నుంచి న్యూయార్క్ లో దీనిని ప్రదర్శనకు ఉంచింది. తాజాగా దీనిని వేలం వేసారు..ఈ వేలంలో ఈ అస్థిపంజరం 6.1 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 48.5 కోట్లు ధర పలికింది.గార్గోసారస్ లు ఏకంగా 42 వేల న్యూటన్ల బలంతో కొరికేసేవి అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే సింహం కంటే పదింతలు బలంతో దాడి చేసేదన్న మాట.ఇంతకుముందు 1997లో టీ–రెక్స్ డైనోసార్ అస్థి పంజరాన్ని వేలం వేయగా 8.36 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే 2020లో మరో టీ–రెక్స్ అస్థి పంజరానికి ఏకంగా 31.8 మిలియన్ డాలర్లు అంటే 252.5 కోట్లు పలికింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

