Viral Video: నాగుపాముపై కాలు పెట్టిన పిల్లాడు.. బుసలు కొడుతూ పైకి లేచిన విష సర్పం.. ఆ తర్వాత ఏమైందంటే?

Shocking Video: ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో తేళ్లు, పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని తేమకు తోడు నిల్వ నీటి కారణంగా విషపు పురుగులు ఇంట్లోకి వస్తుంటాయి. అందుకే ఈ వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పాముల పట్ల..

Viral Video: నాగుపాముపై కాలు పెట్టిన పిల్లాడు.. బుసలు కొడుతూ పైకి లేచిన విష సర్పం.. ఆ తర్వాత ఏమైందంటే?
Giant Cobra
Follow us
Basha Shek

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 14, 2022 | 5:27 PM

Shocking Video: ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో తేళ్లు, పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని తేమకు తోడు నిల్వ నీటి కారణంగా విషపు పురుగులు ఇంట్లోకి వస్తుంటాయి. అందుకే ఈ వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో ఒక తల్లి తన కుమారుడిని పెద్ద నాగుపాము బారి నుంచి చాకచక్యంగా కాపాడింది. దీనికి సంబంధించిన విజువల్స్‌ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఇందులో ఒక తల్లి తన కుమారుడిని పాఠశాలకు పంపేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుంది. అయితే అప్పటికే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము పాకుతూ వెళుతూ ఉంటుంది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు. దీంతో ఆ పాము వెంటనే వెనక్కి వెళ్లింది. బుసలు కొడుతూ పెద్ద ఎత్తున పైకిలేచింది. అదే సమయంలో ఊడిన బూటు కోసం దగ్గరకు వస్తున్న బాలుడిని కాటేయబోయింది. దీన్ని గమనించిన తల్లి వెంటనే స్పందిస్తుంది. పాము నుంచి కుమారుడిని వెంటనే పక్కకు లాగుతుంది. బాలుడిని ఎత్తుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుతంది. దీంతో ఆ పాము తాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కాగా ఈ సంఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అదే సమయంలో క్షణాల్లో స్పందించి నాగుపాము బారి నుంచి కుమారుడిని కాపాడిన తల్లి తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే