RRR: జక్కన్న సినిమాకు సర్‌ప్ర్రైజ్ ఇచ్చిన గూగుల్.. RRR అని టైప్ చేస్తే ఏమోస్తుందో మీరే చూడండి..
RRR Movie: బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) హీరోలుగా నటించారు. ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్,
RRR Movie: బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) హీరోలుగా నటించారు. ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు నటించారు. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చెర్రీ, తారక్‌ల నటన, జక్కన్న టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఓటీటీల్లో సత్తా చాటుతున్న ఈ చిత్రం ఇండిపెండెన్సెడే కానుకగా రేపు టీవీల్లోనూ సందడి చేయనుంది. ఇలా సినిమా విడుదలై ఏదో ఒక రకంగా అందరి నోళ్లలో నానుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌కు ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఆ సీన్స్‌ను గుర్తు చేస్తూ..
అదేంటంటే.. RRR అని గూగుల్‌లో సెర్చ్ చేయగానే.. సెర్చ్‌బార్ కింద బైక్, గుర్రం పరిగెడుతున్నట్లు యానిమేషన్‌లో చూపించారు. ఒకసారి బైక్ ముందు వస్తే.. మరోసారి గుర్రం ముందు వస్తుంది. కాగా ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నడిపితే, చెర్రీ గుర్రం మీద స్వారీ చేశారు. ఓ పాటలో వీరిద్దరూ పోటీపడుతూ కనిపించిన దృశ్యాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ సీన్స్‌ను గుర్తు చేసేలా.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గూగుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న గుర్తింపు తరుణంలోనే గూగుల్ ఈ యానిమేషన్ సింబల్స్ యాడ్ చేసినట్లు. ఇలా ఓ సినిమాకు యానిమేషన్ క్రియేట్ చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతంట్విట్టర్‌లో గూగుల్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ బాగా ట్రెండ్ అవుతోంది.
View this post on Instagram
థ్యాంక్స్ గూగుల్.. ఇదిలా ఉంటే గూగుల్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపింది ఆర్‌ఆర్‌ఆర్ టీం. ‘థ్యాంక్స్ గూగుల్.. మమ్మల్ని సర్‌ప్రైజ్ చేసినందుకు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు ఉన్న పాపులారిటీని గుర్తించినందుకు’ అని థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా గూగుల్‌లో RRR అని సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ లేదా వీడియో తీసుకుని ‘RRR Take Over’ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని ఫ్యాన్స్‌ని ఆర్ఆర్ఆర్ టీం కోరింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..