Karthikeya 2 Review: కార్తికేయ 2 ఫుల్ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్‌తో మెస్మరైజ్ చేసిన నిఖిల్

2014లో విడుదలైన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ట్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిట్ అయిన క్రమంలో సీక్వెల్ ప్రకటించారు.

Karthikeya 2 Review: కార్తికేయ 2 ఫుల్ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్‌తో మెస్మరైజ్ చేసిన నిఖిల్
Karthikeya 2
Follow us

|

Updated on: Aug 13, 2022 | 3:58 PM

2014లో విడుదలైన కార్తికేయ(Karthikeya) సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ట్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిట్ అయిన క్రమంలో సీక్వెల్ ప్రకటించారు. అలా ప్రకటించిన సీక్వెల్ కార్తికేయ 2(Karthikeya 2)అనేక వాయిదాల అనంతరం 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రకటించింది మొదలు సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. మరి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది పరిశీలిస్తే

కథ: కార్తికేయ(నిఖిల్) హైదరాబాద్లో డాక్టర్ గా పని చేస్తూ ఉండగా అనూహ్యంగా సస్పెండ్ అవుతాడు. ఇంట్లో ఒక అశుభం ఎదురవడంతో శ్రీకృష్ణుడి మొక్కు తీర్చకపోవడం వలనే అనుకుంటారు. అలా తల్లి ఒత్తిడితో మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళ్లిన సమయంలో శ్రీకృష్ణుడి కడియం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న శంతను(ఆదిత్య మీనన్)కి టార్గెట్ అవుతాడు. అలా టార్గెట్ అవడానికి ప్రొఫెసర్ రావ్ కారణం అవుతారు. అయితే ప్రొఫెసర్ రావ్ మనవరాలు ముగ్థ (అనుపమా పరమేశ్వరన్) సాయంతో శంతను అండ్ కోని తప్పించుకుని కార్తికేయ తన మామ(శ్రీనివాస రెడ్డి), ట్రక్ డ్రైవర్ సులేమాన్(వైవా హర్ష)తో కలిసి శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సాధించాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ: సినిమాలో పాత్రలు కొంతవరకు రిపీట్ అయ్యాయి కానీ ‘కార్తికేయ’కి, ‘కార్తికేయ 2’కి ఏమాత్రం సంబంధం లేదు. శ్రీకృష్ణుడి కాలి కడియం ఎవరికీ ఇచ్చారు? ఆ కడియం ఎక్కడ ఉంది? దానికి ఉన్న శక్తి ఎలాంటిది, దానిని ఈ తరం కోసం అసలు ఆయన ఎందుకు దాచారు? అని అనే విషయాలను చాలా ఆసక్తికరంగా చూపడానికి డైరెక్టర్ ట్రై చేశారు. అసలు దేవుడిని ఏమాత్రం నమ్మని ఓ డాక్టర్… కృష్ణుడి గొప్పతనాన్ని గురించి వేద్ పాఠక్(అనుపమ్ ఖేర్) ద్వారా తెలుసుకుని సమాజ హితం కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టడానికి ప్రయత్నించాడన్నదే ఈ సినిమా. ఈ కడియం సాధించడం కోసం ఒక్కే ప్రాంతంలో ఉన్న ఒక్కో క్లూ అందుకుంటూ ముందుకు వెళ్లడం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కథలోకి తీసుకువెళ్లడానికి కొంత సమయం తీసుకున్న దర్శకుడు కథలోకి తీసుకువెళ్లాక సీట్లకు ప్రేక్షకులు అతుక్కుపోయేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. నిజానికి హిందుత్వాన్ని నమ్మేవారికి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. మిగతా వారికి చందమామ కథలా అనిపిస్తుంది. ఇక కొన్ని లాజిక్స్ మిస్ చేశారు కానీ అవి ఓవరాల్ గా చిన్న తప్పిదాలే అనిపిస్తాయి. మూడో భాగానికి హింట్ ఇవ్వడానికి ఆసక్తి చూపిన దర్శకుడు రెండో భాగానికి కంక్లూజన్ కూడా కొంచెం అర్ధవంతంగా ప్లాన్ చేసి ఉంటె బాగుండేది.

ఇవి కూడా చదవండి

నటీనటులు: సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే నిఖిల్ కార్తికేయ పాత్రలో ఒదిగిపోయాడు. అనుపమా పరమేశ్వరన్ కు నటించే అవకాశం ఉన్న పాత్ర దక్కింది. హీరో మావగా శ్రీనివాసరెడ్డి, ట్రక్ డ్రైవర్ సులేమాన్ గా వైవా హర్ష కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ఆదిత్య మీనన్, వెంకట్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. హీరో తల్లిగా తులసి, సినిమా ప్రారంభంలో కో-డాక్టర్స్ గా సత్య, ప్రవీణ్ తమ పరిధి మేర నటించారు. ఇక అనుపమ్ ఖేర్ పాత్ర నోట పలికే డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కాలభైరవ ఆర్ఆర్ గురించి. ఆయన తన ఆర్ఆర్ తో సినిమాను మరో లెవల్ కు తీసుకు వెళ్ళాడు. ఇక అలాగే సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ కూడా చేసిన కార్తిక్ ఘట్టమనేని విజువల్సే కాదు… ఎడిటింగ్ సైతం ఎక్కడా వంక పెట్టలేని విధంగా ఉంది. తన విజువల్స్ తో ప్రతి సన్నివేశానికీ ప్రాణం పోశారు. అలాగే వీఎఫ్ఎక్స్ టీమ్ కూడా మంచి అవుట్ ఫుట్ ఇచ్చింది. సంభాషణలు కూడా ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా సెట్ అయ్యాయి.

ఫైనల్ గా: ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్లి హ్యాపీగా చూడగలిగే ఒక మిస్టరీ థ్రిల్లర్. రొటీన్ సినిమాలకు భిన్నంగా థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారు అందరికీ పర్ఫెక్ట్ గా సూటయ్యే సినిమా ఇది.

లక్ష్మీనారాయణ, ఎడిటర్, టీవీ9 ET

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..