AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BellyFat : డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించే చిట్కా.. ప్రయత్నిస్తే ఫలితం మీరే గమనిస్తారు..

ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. పైగా తల్లిపాలను పెంచటంలోనూ ఈ కషాయం తొడ్పడుతుంది.

BellyFat : డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించే చిట్కా.. ప్రయత్నిస్తే ఫలితం మీరే గమనిస్తారు..
Belly Fat Drinks
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2022 | 1:27 PM

Share

BellyFat : డెలివరీ అయ్యాక చాలా మందిలో పొట్ట, నడుము భాగంలో కొవ్వు పెరిగిపోయి లావుగా తయారవుతుంటారు. దాంతో కొందరు అసహ్యంగా భావించి నలుగురిలో కలవాలన్నా, బయటకు వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటారు. పెరిగిన పొట్టను తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఫలితం ఉండదు. చాలా మంది పొట్ట తగ్గటానికి విపరీతంగా డైటింగ్ చేసేస్తూ ఉంటారు. కానీ పొట్ట తగ్గకుండా నీరసం, నిస్సత్తువ రావటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల బారినపడుతుంటారు. అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవటానికి ఇలాంటి సులభమైన చిట్కాలను ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మన వంటింట్లోనే లభించే కొన్ని రకాల మసాల దినుసులతో బెల్లి ఫ్యాట్‌కు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే యాలకులు, సోంపుతో కలిసి చేసే కషాయం కూడా డెలీవరి తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు సహపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. పైగా తల్లిపాలను పెంచటంలోనూ ఈ కషాయం తొడ్పడుతుంది.

ఈ నీటిని తాగిన10 నిమిషాల తర్వాత పొట్ట మీద నువ్వుల నూనె రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కాపడం పెట్టుకోవాలని చెబుతున్నారు. దాంతో పొట్ట మీద కండరాలు టైట్ గా మారతాయి. ఇలా చేయటం వలన డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెస్ మార్క్స్ కూడా తొలగిపోతాయి. తర్వాత పొట్టకు సంబందించిన వ్యాయామాలు చేసి అనంతరం స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులపాటు చేస్తూ ఉంటే..పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నడుం చుట్టు సన్నబడతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఉంది. TV9 తెలుగు ధృవీకరించలేదు. ఇక్కడ ఇచ్చిన సమాచారం నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)