Heart Attack: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండెపోటుకు సంకేతాలు కావొచ్చు.. జాగ్రత్తపడాల్సిందే..
Signs of Heart Attack: అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, జీవనశైలిలో మార్పులతో ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత చిన్న వయసులోనే గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు.
Signs of Heart Attack: అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, జీవనశైలిలో మార్పులతో ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత చిన్న వయసులోనే గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. దీనికి కారణాలేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధమనుల గోడల్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ తదితర పదార్థాలు పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది. ఫలితంగా గుండె కండరాలకు తగినంత రక్తం అందనప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవారిలో జుట్టు రాలడం సాధారణం. బట్టతల తల గుండె జబ్బులకు ప్రమాదకరమైన సంకేతం. అయితే గుండెపోటు సంభవించే ముందు, శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. అవేవో తెలుసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ముఖం, తల, చెవుల్లో వచ్చే మార్పులను చూసి గుండెపోటు లక్షణాలను గుర్తించవచ్చు.
స్పృహ కోల్పోవడం
గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపివేసినప్పుడు, రక్తం, ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల గుండె కండరాలకు నష్టం కలుగుతుంది. హృదయ స్పందన రేటు మందగించవచ్చు లేదా వేగంగా మారవచ్చు. ఇది క్రమంగా గుండెపోటు సమస్యలకు దారి తీస్తుంది.
ఛాతీలో అసౌకర్యం
ఛాతీలో అసౌకర్యం లేదా ఛాతీలో నొప్పి కలగడం గుండెపోటుకు సాధారణ లక్షణాలలో ఒకటి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, ఎవరికైనా ఛాతీలో ఒత్తిడి లేదా తీవ్రమైన నొప్పిని కలిగినప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ ప్రారంభమైనప్పుడు, ఛాతీలో అసౌకర్యం, చెమటలు పట్టడం, వికారం, ఊపిరి ఆడకపోవడం వంటివి సంభవిస్తాయి. అందువల్ల, ఛాతీ నొప్పి గురించి తెలుసుకుని, వచ్చిన వెంటనే రిపోర్ట్ చేయడం మంచిది.
మెడ నొప్పి
రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. ఇది గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. ఛాతీలో నొప్పి మొదలై మెడ వరకు వ్యాపించినా లేదా మెడ కండరాలు బిగుసుకుపోయినా అప్రమత్తంగా ఉండాలి.
పొత్తికడుపులో అసౌకర్యం
పొత్తికడుపు పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యం కూడా కూడా గుండెపోటుకు ముందస్తు సంకేతం. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు కోరుతున్నారు.
ఇవి కూడా..
- కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతున్నట్లయితే గుండె పోటుగా అనుమానించాలి
- కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు.
- కొందరికి రెండు చేతులు, భుజాలు కూడా నొప్పిగా, అసౌకర్యంగా ఉంటాయి
(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఉంది. TV9 తెలుగు ధృవీకరించలేదు. ఇక్కడ ఇచ్చిన సమాచారం నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..