AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ber Fruit Benefits: రేగు పళ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గటమే కాదు.. చర్మం ముడతలు మాయం చేస్తుంది..!

రేగుపళ్ల లో ఒత్తిడి తగ్గించే గుణాలు ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. యవ్వనంగా ఉండేట్లు చేస్తాయి. ఇంకా మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

Ber Fruit Benefits: రేగు పళ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గటమే కాదు.. చర్మం ముడతలు మాయం చేస్తుంది..!
Ber Fruit
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2022 | 1:07 PM

Share

Ber Fruit Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరు సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే అందరూ ఆయా సీజన్స్‌లో లభించే పండ్లు, కూరగాయలు తీసుకుంటుంటారు. అలాంటి సీజనల్‌గా దొరికే పండ్లలో రేగు పళ్లు ఒకటి. సీజన్‌లో వీటిని ప్రతిఒక్కరూ తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. రేగుపళ్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ సమృద్ధిగా అందుతాయి. రేగుపళ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ హ్యూమన్ బాడీకి కావల్సిన పోషకాలను అందిస్తుంది. తక్కువ ధరలోనే దొరికే రేగుపళ్లను ప్రతీ ఒక్కరు తప్పకుండ తినాలి.

రేగుపళ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగి వుంటాయి. రేగుపళ్లు జీర్ణశక్తికి, ఆకలి పెరుగుదలకు, రక్తహీనతను నివారించడానికి ఉపయోగపడతాయి. విసుగు, నీరసం, శ్వాస నాళాల వాపు నెమ్మదించడానికి, గొంతునొప్పికి, హిస్టీరియా లాంటి వ్యాధుల నివారణకు రేగుపళ్లు చక్కటి ఔషధంగా ఉపయోగిస్తారు. చెడుకొలెస్ట్రాల్‌ని కరిగించటంలోనూ రేగుపళ్లు కీలకంగా పనిచేస్తాయి.

రేగుపళ్లు తింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా వుండేందుకు ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ పండ్లు తినడం మంచిది. ఎందుకంటే రేగుపళ్లు లో క్యాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు ఈ పండ్లు తింటే వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రేగుపళ్ల లో ఒత్తిడి తగ్గించే గుణాలు ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. యవ్వనంగా ఉండేట్లు చేస్తాయి. ఇంకా మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!