Azadi Ka Amrit Mahotsav: మితిమీరిన దేశ భక్తి.. జాతీయ జెండాలపై ఎమ్మెల్యే ఫోటో.. నెటిజన్ల ఫైర్

ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకోవడానికి అభిమాని బొడ్డు రవి కుమార్ ప్రమాదకరస్దాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే..

Azadi Ka Amrit Mahotsav: మితిమీరిన దేశ భక్తి.. జాతీయ జెండాలపై ఎమ్మెల్యే ఫోటో.. నెటిజన్ల ఫైర్
Flag
Follow us

|

Updated on: Aug 15, 2022 | 12:09 PM

Azadi Ka Amrit Mahotsav: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కానీ, కొన్నిచోట్ల మితిమీరిన దేశభక్తితో కొందరు అభిమానులు చెయ్యకూడని పనులు చేస్తున్నారు. ఇటీవల జాతీయ జెండాలో గులాబీ రంగు మిక్స్ చేసి పోస్టర్లు వేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అది మరువక ముందే తాజాగా అటువంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. జాతీయ జెండా పై ఎమ్మెల్యే ఫోటోను ముద్రించిన ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో మాత్రం జెండా పండగ సందర్బంగా ఓ ఎమ్మెల్యే ఫోటో వివాదాస్పదమవుతోంది. కుత్భుల్లాపూర్‌ ఎమ్మెల్యే ఫోటోలు జాతీయ జెండాలపై కనిపించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుత్బుల్లాపూర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటోలో ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకోవడానికి అభిమాని బొడ్డు రవి కుమార్ ప్రమాదకరస్దాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే జాతీయ జెండాలో ఎమ్మెల్యే, అభిమాని ఫోటోలు చూసి జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను అభిమానించే బొడ్డు రవికుమార్ అనే వ్యక్తి జాతీయ జెండాలపై ఓవైపు ఎమ్మెల్యే ఫోటోను, మరోవైపు తన ఫోటోను ముద్రించుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2002 నియమావళి ఉల్లంఘనగా తెలుస్తుంది. దీంతో సదరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన నాయకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన నాయకులతోపాటు, సదరు ఎమ్మెల్యే కూడా చిక్కుల్లో పడాల్సి వచ్చింది. ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు