Tea Stains Removal: అయ్యయ్యో.. బట్టలపై టీ మరకలపడ్డాయా..? ఈ సింపుల్ టిప్స్ తో ఈజీగా వదిలించుకోండి..

బట్టలపై టీ మరకలను తొలగించడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి, వాటి సహాయంతో మీరు బట్టలు మెరిసేలా చేయవచ్చు.

Tea Stains Removal: అయ్యయ్యో.. బట్టలపై టీ మరకలపడ్డాయా..? ఈ సింపుల్ టిప్స్ తో ఈజీగా వదిలించుకోండి..
Tea Stains Removal
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2022 | 9:08 AM

Tea Stains Removal:  చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కడుపులో కప్పు కాఫీనో, టీ నో పడకపోతే..వారికి రోజు ప్రారంభం కాదు. చాలా మందికి, రోజు ఒక కప్పు టీతో ప్రారంభమవుతుంది. కానీ, టీ తాగుతుండగా తరచూ టీ బట్టలపై పడి బట్టలు టీ మరకలు పడుతుంటాయి. దీన్ని తొలగించడం చాలా కష్టమైన పని. కొన్ని సులభమైన పద్ధతుల సహాయంతో, బట్టలపై టీ మరకలను నిమిషాల్లో తొలగించవచ్చు. బట్టలపై టీ మరకలను తొలగించడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి, వాటి సహాయంతో మీరు బట్టలు మెరిసేలా చేయవచ్చు.

టీ మొండి మరకలను తొలగించడానికి చాలా మంది ఖరీదైన డిటర్జెంట్ సబ్బు, స్టెయిన్ రిమూవర్ మొదలైన వాటికి తెగ ఖర్చుపెట్టేస్తుంటారు. కానీ దాని ఉపయోగం ఏమీ ఉండదు.. పైగా, మరక విరుగుడుకు బదులుగా మన విలువైన బట్టలు పాడవుతాయి. బట్టలపై టీ మరకలను ఎలా తొలగించాలో కొన్ని గొప్ప చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. నిమ్మరసం: నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో, అలాగే బట్టలపై మరకలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. బట్టలను శుభ్రం చేయడానికి నిమ్మరసం ఉత్తమ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. టీ మరకలు పోవాలంటే.. నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. మరకపడిన చోట నిమ్మరసం వేసి రుద్దాలి. ఆ తర్వాత సబ్బుతో దుస్తులు ఉతకాలి. ఇలా చేస్తే బట్టలపై ఉన్న టీ మరకలు మాయమవుతాయి. బంగాళాదుంప: బట్టలపై టీ మరకలను శుభ్రం చేయడానికి బంగాళాదుంపలను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం బంగాళాదుంపలను నీటిలో బాగా ఉడకబెట్టాలి..ఉడికించిన బంగాళాదుంప నీటిలో టీ మరకలు పడిన బట్టలు వేసి కాసేపు నానా బెట్టాలి. అలా ఓ అరగంట తర్వాత ఆ బట్టలు తీసి శుభ్రంగా ఉతికి ఆరబెడితే టీ మరక పోతుంది.

వెనిగర్: బట్టలపై పడ్డ టీ మరకలను తొలగించేందుకు వెనిగర్ సమర్థవంతంగా పని చేస్తుంది. మరక పడిన చోట వెనిగర్‌ వేసి రుద్దాలి. కొన్ని నీళ్లల్లో చెంచా వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి మరక పడిన చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే మరక మాయమవుతుంది. మీ బట్టలు సరికొత్తగా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

టూత్‌ పేస్ట్‌: 

అలాగే, టీ మరక పడిన చోట మనం వాడే టూత్‌ పేస్ట్‌ను పూసి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో ఉతికితే కూడా మరకలు ఈజీగా పోతాయి.