మనుషుల వలె ఇతర జంతువులకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి.. ఆసక్తికర విషయాలు మీ కోసం

సువిశాల విశ్వంలో ఎన్నో రకాల జీవులు మనుగడ కొనసాగిస్తున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి అత్యంత పెద్దవైన బ్లూ వేల్స్ వరకు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. మానువుడు కూడా ఒక జంతువు అనే విషయం మనకు..

మనుషుల వలె ఇతర జంతువులకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి.. ఆసక్తికర విషయాలు మీ కోసం
Speaking News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 15, 2022 | 9:16 AM

సువిశాల విశ్వంలో ఎన్నో రకాల జీవులు మనుగడ కొనసాగిస్తున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి అత్యంత పెద్దవైన బ్లూ వేల్స్ వరకు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. మానువుడు కూడా ఒక జంతువు అనే విషయం మనకు తెలిసిందే. కొన్ని జీవులు తమ భావాలను సైగలు, అరుపులు, ప్రవర్తనల ద్వారా తెలియజేస్తే మానవులు మాత్రమే మాటల రూపంలో భావాలు పంచుకుంటారు. ఈ భూమిపై నివసిస్తున్న జంతుజాతుల్లో మానవుడు మాత్రమే మాట్లాడగలడు. అయితే మిగతా జంతువులు ఎందుకు మాట్లాడడం లేదు అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అవి ఎందుకు మాట్లాడలేకపోతున్నాయనే విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మనుషులు మాట్లాడేందుకు స్వర పేటిక ఎంతో సహాయపడుతుంది. ఈ స్వరపేటికలో కాలక్రమంలో చాలా మార్పులు జరిగాయి. 43 రకాల జాతి కోతుల స్వరపేటికలను పరీక్షించి కీలక విషయాలు వెల్లడించారు. స్వర త్వచం అనేది మనుషుల్లో మాత్రమే ఉందని, వేరే జంతువుల్లో అది లేవని గుర్తించారు. స్వర తంతువులకు అంటి ఉండే చిన్న రిబ్బన్‌ వంటి నిర్మాణమే స్వర త్వచం. అంతే కాకుండా వాయు కోశాలు లేకపోవడం వల్ల మానవుడు మాట్లాడే శక్తిని పెంచుకున్నాడని నిర్ధరించారు.

అయితే ఇతర జంతువుల గొంతు నిర్మాణాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఈ కారణంగానే అవి కాలానుగుణంగా పరిణామం చెందలేక, మాట్లాడే శక్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఈ మేరకు జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీలో సెంటర్‌ ఫర్‌ ఎవల్యూషనరీ ఆరిజిన్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయనం వివరాలను ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురించారు. చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్స్‌, గిబ్బన్‌ తదితర కోతి జాతులపై పరిశోధనలు జరిపి ఈ విషయాలు తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?