AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ప్రతి ఐదుగురిలో ఒకరు ఆ కారణంగానే చనిపోతున్నారు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకు పెరిగిపోతోంది. ఏటా మిలియన్ల మంది కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కారణంగా భారతీయులు...

Health: ప్రతి ఐదుగురిలో ఒకరు ఆ కారణంగానే చనిపోతున్నారు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Air Pollution
Ganesh Mudavath
|

Updated on: Aug 15, 2022 | 8:53 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకు పెరిగిపోతోంది. ఏటా మిలియన్ల మంది కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కారణంగా భారతీయులు 9 ఏళ్ల ఆయుష్షు కోల్పోతున్నారని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. పారిశ్రమలు అధిక సంఖ్యలో ఏర్పాటవడం, అడవులు నరికివేయడం, వాహనాల సంఖ్య పెరగడం, మైనింగ్‌, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వంటి కారణాలతో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ గాలిని పీల్చడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు (Health Problems) చుట్టుముడుతున్నాయి. గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు వాయు కాలుష్యంతోనే చనిపోతున్నారని అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాయు కాలుష్యం కారణంగా అకాల మరణం, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, గురక, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. కాగా.. గర్భిణీలు వాయు కాలుష్యానికి గురైతే పుట్టబోయే పిల్లలకు ఆటిజం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యానికి ఎక్కవ ఎఫెక్ట్‌ అయితే నరాలు, మెదడు, కిడ్నీలు, దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

సాధారణంగా రోడ్లపై కాలుష్యం అధికంగా ఉంటుంది. కాలుష్య కారకాలు గాలిలో కలిసిపోయి మనం పీల్చుకునే సమయంలో అవి మన శరీరంలోని వెళ్తాయి. అందుకే బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం వంటి కనీస చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రవాణా వ్యవస్థ కారణంగా వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. వ్యక్తిగత వాహనాలు అధికమవడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. కాబట్టి వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి, వీలైనంత వరకు ప్రజా రవాణా వాడితే మంచిది. ఇలా చేస్తే ఇంధన వినియోగాన్ని తగ్గించి వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించవచ్చు. వంట కోసం గ్యాస్ స్టవ్ లను కాకుండా ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం ఉత్తమం. అంతే కాకుండా ఇంట్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎయిర్ ప్యూరిఫైర్ లను వాడటం గానీ, ఇంట్లో మొక్కలు పెంచడం వంటివి చేయాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..