AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆనంద్ మహీంద్రా 47 ఏళ్ల క్రితం తీసిన ఫోటో.. నెట్టింట హల్‌చల్‌..క్యాప్షన్‌ అస్సలు మిస్‌ కావొద్దు..!

వైరల్ అవుతున్న ఆ ఫోటోలో స్థానికులు ఒకరితో ఒకరు తెగ ముచ్చటెస్తున్నారు. బిజీబిజీగా ఏదో విషయమై మాట్లాడేసుకుంటున్నారు. ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోని..

Viral News: ఆనంద్ మహీంద్రా 47 ఏళ్ల క్రితం తీసిన ఫోటో.. నెట్టింట హల్‌చల్‌..క్యాప్షన్‌ అస్సలు మిస్‌ కావొద్దు..!
Anand Mahindra
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2022 | 12:36 PM

Share

Viral News: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మీ అందరికీ తెలిసిందే..అతను స్ఫూర్తిదాయకమైన, చమత్కారమైన కంటెంట్‌ను షేర్ చేస్తూ..తన అనుచరులను కట్టిపడేస్తుంటారు.. ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన పోస్ట్‌లు క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆగస్ట్ 13న 47 సంవత్సరాల క్రితం తాను తీసిన ఫోటోని షేర్‌ చేశారు. తాను స్పెయిన్‌లో ఈ ఫోటో తీశానని, దానితో పాటు ఆలోచింపజేసే క్యాప్షన్‌ను కూడా రాశానని తెలిపాడు. పోస్ట్ స్పష్టంగా, చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఆనంద్ మహీంద్రా తన ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ తన ట్వీట్‌లో ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. అతను 1975లో స్టూడెంట్ ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు స్పెయిన్‌లోని టోలెడోలో ఈ చిత్రాన్ని తీసినట్టుగా వివరించారు. ఇకపోతే, వైరల్ అవుతున్న ఆ ఫోటోలో స్థానికులు ఒకరితో ఒకరు తెగ ముచ్చటెస్తున్నారు. బిజీబిజీగా ఏదో విషయమై మాట్లాడేసుకుంటున్నారు. ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోని మీరు కూడా తప్పక చూడండి.

ఇవి కూడా చదవండి

ఈ ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ, ఆనంద్ మహీంద్రా ప్రపంచవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ ప్రారంభమైనందున, అత్యంత సమర్థవంతమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఎల్లప్పుడూ నోటి మాటల ద్వారానే ఉంటుందని ఈ ఫోటో నాకు గుర్తు చేసింది. ఆనంద్ మహీంద్రా ఫోటోగ్రఫీ ప్రతిభను చూసి, అతని అభిమానులు ఆశ్చర్యపోయారు. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ ఫోటో ఇప్పుడు ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇప్పటి వరకు వేల మంది లైక్ చేసారు. మహీంద్రా ట్వీట్‌ను చాలా మంది రీట్వీట్ చేశారు. కామెంట్ సెక్షన్‌లో కొందరు అద్భుతం అని, మరికొందరు మహీంద్రాతో ఏకీభవిస్తున్నారని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి