Road Lines Markings: రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా పెట్టించుకోము. చాలా మందికి కొన్ని విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు. ముఖ్యంగా రోడ్ల వెంట వెళ్తున్నప్పుడు రహదారులపై తెల్లటి, పసుపు రంగు, నల్లటి రంగు లాంటి గీతలు చూస్తుంటాము. కానీ అలాంటి గీతలను పెద్దగా పట్టించుకోము. వాహనదారులు రోడ్లపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. అందుకే ట్రాఫిక్ గుర్తులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం ముఖ్యం. దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా విధిగా చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే కేసులు,జరిమానాలు తప్పవు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్, గుర్తులనే కాకుండా రహదారిపై ఉండే గీతల గురించి కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. రోడ్లపై తెలుపు, పసుపు రంగుల్లో గీతలను చూసి ఉంటారు. అసలు ఆ గీతలు ఎందుకుంటాయి..? వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం.