- Telugu News Photo Gallery People of this country are bathing in the volcano, know about this unique volcano
Mud Volcano: తెలుసా! ఈ అగ్నిపర్వతాల్లో స్నానాలు చేయొచ్చు.. ఎక్కడున్నాయంటే..
అజర్‌బైజాన్‌లోని గరదాగ్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్ట్ 11న ఓ మట్టి అగ్నిపర్వతం బద్దలైంది. చాలా మట్టి గాలిలోకి లేచి భయంకరంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Updated on: Aug 15, 2022 | 2:17 PM

అజర్‌బైజాన్‌లోని గరదాగ్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్ట్ 11న ఓ మట్టి అగ్నిపర్వతం బద్దలైంది. చాలా మట్టి గాలిలోకి లేచి భయంకరంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇటువంటి మట్టి అగ్నిపర్వతాలను మట్టి గోపురాలు అని పిలుస్తారు. వేడి బురదతో పాటు నీరు, వాయువు మట్టి అగ్నిపర్వతాల నుంచి బయటకు వస్తుంటాయి. నిజానికి ఇవి అగ్నిపర్వతాలు కావు. ఐతే అగ్నిపర్వతాల మాదిరి పేలడం, లోపలనుంచి బురద లావాలా ప్రవహించడం కారణంగా దీనిని అగ్నిపర్వతం అంటారు.

ఇటువంటి మట్టి అగ్నిపర్వతాలు ప్రపంచంలో అనేక దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అండమాన్-నికోబార్ ద్వీపంలో ఇవి కనిపిస్తాయి. ఈ మట్టి అగ్నిపర్వతాల్లో 86 శాతం మీథేన్ వాయువు, కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్-నత్రజని ఉంటాయి.

ఇటువంటి మట్టి అగ్నిపర్వతాలు ప్రపంచంలో అనేక దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అండమాన్-నికోబార్ ద్వీపంలో ఇవి కనిపిస్తాయి.

అజర్‌బైజాన్ దానికి అనుకుని ఉన్న కాస్పియన్ తీరంలో ఇటువంటి అగ్నిపర్వతాలు అధికంగా కనిపిస్తాయి. 400 కంటే ఎక్కువ మట్టి అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయి. చాలా దేశాల్లో ఈ మట్టి అగ్నిపర్వతాల్లో స్నానాలు చేస్తుంటారు.

ఈ మట్టి అగ్నిపర్వతాల్లో 86 శాతం మీథేన్ వాయువు, కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్-నత్రజని ఉంటాయి.




