Allergy: ఇంట్లో ఉండే ఈ వస్తువులు మీకు అలర్జీని కలిగిస్తాయి..? నివారణ మార్గాలేంటి..?

Allergy: AirPurify గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇదే ప్యూరిఫైయర్ మీ అలర్జీని కూడా కలిగిస్తుంది. ఇది మీకు స్వచ్ఛమైన..

Allergy: ఇంట్లో ఉండే ఈ వస్తువులు మీకు అలర్జీని కలిగిస్తాయి..? నివారణ మార్గాలేంటి..?
Allergy
Follow us
Subhash Goud

|

Updated on: Aug 15, 2022 | 8:36 PM

Allergy: AirPurify గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇదే ప్యూరిఫైయర్ మీ అలర్జీని కూడా కలిగిస్తుంది. ఇది మీకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అయితే వర్షం వల్ల స్వచ్ఛమైన గాలితో పాటు అనేక రకాల అలర్జీలు వస్తాయి. వర్షాకాలంలో అనేక రకాల అలర్జీ ట్రిగ్గర్లు ఉన్నాయి. అలర్జీ సమస్యలను కలిగించే కొన్ని విషయాల గురించి తెలుసుకోండి. ఇంట్లో ఉండే ఏ వస్తువులు అలర్జీకి కారణమవుతాయో తెలుసుకుందాం.

ఇంట్లో అలెర్జీలకు కారణం ఏమిటి?

కళ్ల దురద, ముక్కు కారడం, తుమ్ములు, శ్వాసలో గురక అనిపించడం అలర్జీకి సంకేతం. ఇంట్లో ఉంటూ కూడా ఇలాంటి ఇబ్బందిని అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఇంట్లోని వస్తువులే కావచ్చు. ఇంట్లో అలర్జీకి కారణమయ్యే అనేక వస్తువులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

– ఇంట్లో ఉండే వస్తువులపై దుమ్ము, పురుగులు

– బొద్దింక రెట్టలు

– రిమోట్

– మొబైల్ మొదలైన వాటిపై దుమ్ము.

అలెర్జీని తగ్గించే మార్గాలు

– కాలుష్యం పెరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు.

– అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో మీ ఇంటి కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచండి.

– రోజూ తలస్నానం చేయండి

– బయటి నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉతకాలి.

– బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

– ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

– బయటి నుంచి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలర్జీలను ఇతర మార్గాల్లో నివారించవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి