Health Tips: రక్తం శుభ్రపరచడానికి ఈ హెర్బల్ టీలను ట్రై చేయండి.. ఆరోగ్యంతోపాటు మరెన్నో లాభాలు

మీ రక్తంలోని టాక్సిన్స్ ను చాలా సులభంగా, శ్రమ లేకుండా బయటకు పంపాలంటే ఆహారంలో కొన్ని హెర్బల్ టీలను చేర్చుకోవచ్చు. ఇవి శరీరం, రక్తం రెండింటినీ డిటాక్స్ చేస్తాయి.

Health Tips: రక్తం శుభ్రపరచడానికి ఈ హెర్బల్ టీలను ట్రై చేయండి.. ఆరోగ్యంతోపాటు మరెన్నో లాభాలు
Herbal Tea
Follow us

|

Updated on: Aug 15, 2022 | 7:36 PM

Herbal Tea For Body Detox and Blood Clean: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని విషాన్ని బయటకు పంపడం చాలా ముఖ్యం. శరీరంలో ఉండే విషంతో మీ చర్మంలోని మెరుపు పోతుంది. చర్మంపై మొటిమలు రావడం మొదలవుతాయి. అంతేకాకుండా అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే.. మీ రక్తంలోని టాక్సిన్స్ ను చాలా సులభంగా, శ్రమ లేకుండా బయటకు పంపాలంటే ఆహారంలో కొన్ని హెర్బల్ టీలను చేర్చుకోవచ్చు. ఇవి శరీరం, రక్తం రెండింటినీ డిటాక్స్ చేస్తాయి. అటువంటి పరిస్థితిలో రక్తాన్ని శుభ్రపరచడానికి మీరు ఎలాంటి టీ లను తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తాన్ని శుభ్రపరచడం కోసం ఈ హెర్బల్ టీలను తాగండి..

తులసి టీ: తులసి సులభంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కావున రోజూ 10 నుంచి 12 తులసి ఆకులను తింటే రక్తం శుద్ధి అవుతుంది. తులసి టీ చేయడానికి ఒక గ్లాసు నీరు తీసుకోండి. దీనికి 10 నుంచి 12 తులసి ఆకులను జోడించండి. నీరు బాగా మరిగిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి, టీ లాగా సిప్ చేస్తూ తాగండి. మీరు దీన్ని ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

లెమన్ టీ: నిమ్మకాయ టీ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, మినరల్స్ శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. లెమన్ టీ చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని టీ ఆకులను వేసి మరిగించాలి. దీని తరువాత ఫిల్టర్ చేసి సగం నిమ్మకాయను పిండి తాగండి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరింత మంచిది.

దాల్చిన చెక్క – బెల్లం టీ: దాల్చిన చెక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క – బెల్లం టీని తయారు చేయడానికి ఒక గ్లాసు నీటిలో కొద్దిగా దాల్చిన చెక్కను ముక్కలు చేసి వేయండి, ఆ తర్వాత బెల్లాన్ని జోడించండి. బాగా మరిగిన తర్వాత వడగట్టి తాగండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..