Health Care: ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున ఈ జ్యూస్‌లు తాగండి.. ఇక ఆసుపత్రికి వెళ్లాల్సిన పనే ఉండదట..!

జ్యూస్‌లలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, ఖనిజాలు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుంచి బయటపడటానికి ఇవి సహాయపడతాయి.

Health Care: ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున ఈ జ్యూస్‌లు తాగండి.. ఇక ఆసుపత్రికి వెళ్లాల్సిన పనే ఉండదట..!
Juice
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2022 | 4:16 PM

Juices Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుంటారు. అయితే.. పరగడుపున కొన్ని జ్యూస్‌లు తాగితే.. ఆరోగ్యంగా ఉండొచ్చని, ఇక ఆసుపత్రికి వెళ్లాల్సిన పనే ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జ్యూస్‌లలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, ఖనిజాలు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుంచి బయటపడటానికి ఇవి సహాయపడతాయి. అందుకే జ్యూస్‌లను తాగాలని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో ఎలాంటి రసాలను తీసుకుంటే మంచిదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

దానిమ్మ రసంః ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగడం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. ఈ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రూచికరంగా ఉండే దానిమ్మ రసం రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మంచిది.

ఉసిరి జ్యూస్ః ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, విటమిన్ సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మలబద్ధకం సమస్యను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

సొరకాయ రసంః సొరకాయ రసంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇంకా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సొరకాయ రసం గుండె ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది. అందుకే మీ బరువు తగ్గించే డైట్‌లో సొరకాయ రసాన్ని చేర్చుకుంటే మంచిది.

అలోవెరా జ్యూస్ః కలబందలో విటమిన్ సి, ఎ, విటమిన్ బి3 ఉంటాయి. ఇందులో కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల పొట్టలోని వేడి తగ్గుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!